Paper Leak Case : ఉద్యోగ అభ్యర్థులకు అండగా ఉంటామన్న కేటీఆర్-minister ktr appeal to job aspirants over tspsc paper leak case ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Paper Leak Case : ఉద్యోగ అభ్యర్థులకు అండగా ఉంటామన్న కేటీఆర్

Paper Leak Case : ఉద్యోగ అభ్యర్థులకు అండగా ఉంటామన్న కేటీఆర్

Mar 18, 2023 07:00 PM IST HT Telugu Desk
Mar 18, 2023 07:00 PM IST

  • TSPSC Paper Leak Case Updates: కమిషన్‌లో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. శనివారం సీఎం కేసీఆర్‌తో మంత్రులు, ఉన్నతాధికారుల భేటీ ముగిసిన అనంతరం మంత్రి కేటీఆర్‌ బీఆర్కే భవన్‌లో మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడానికి సహకరిస్తామని చెప్పారు. రద్దు అయిన 4 పరీక్షలకు సంబంధించి కోచింగ్‌ మెటీరియల్‌ అంతా ఆన్‌లైన్లో తీసుకువస్తామన్నారు. ఉచితంగా మెటీరియల్‌ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే అన్న కేటీఆర్... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించామని చెప్పారు. రీడింగ్‌ రూమ్‌లను సైతం 24 గంటలూ తెరిచే ఉంచాలని నిర్ణయించామని..  ఉచిత భోజన వసతి కూడా అందిస్తామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు వీటిని పర్యవేక్షిస్తారని చెప్పుకొచ్చారు. ఉద్యోగార్థులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు. అపోహాలు నమ్మవద్దని కోరారు. రాజకీయ నిరుద్యోగుల మాటలు పట్టించుకోవద్దని సూచించారు. 

More