TS High court On MLC: ఆ అధికారం గవర్నర్‌కు లేదన్న తెలంగాణ హైకోర్టు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కీలక తీర్పు
07 March 2024, 11:27 IST
- TS High court On MLC: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో కోదండరాం, అలీఖాన్ నియామకాలను రద్దు చేయడంతో పాటు తిరిగి ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు
TS High court On MLC: తెలంగాణలో గవర్నర్ కోటా Governor Quota MLC ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నియామకాలను రద్దు చేయడంపై దాఖలైన పిటిషన్‌తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నియామకాలపై దాఖలైన మరో పిటిషన్‌పై తీర్పులు వెలువరించింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలను హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వ సిఫార్సులపై ఎమ్మెల్సీలుగా కోదండరాంతో పాటు సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు. ఈ వ్యవహారంపై జనవరి 30న హైకోర్టు స్టే విధించింది. కోదండరాం Kodandaram, అలీఖాన్‌ల Alikhan నియామకాలను రద్దు చేయడంతో పాటు గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్‌పై కీలక తీర్పు వెలువరించింది.
గత ఏడాది గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్‌ఖు సిఫార్సు చేసింది. ఆ పేర్లను గవర్నర్ తిరస్కరించడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత జనవరిలో కోదండరాం, అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించడంతో గవర్నర్ అమోదించారు.
కోర్టు వివాదం పెండింగ్‌లో ఉండగా నియామకాలు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరో పిటిషన్ దాఖలైంది. రెండు వేర్వేరు పిటిషన్లపై నేడు తీర్పు వెలువడింది. ఎమ్మెల్సీల నియామకాలను రద్దు చేయడానికి గవర్నర్‌కు అధికారం లేదని, పేర్లను క్యాబినెట్‌కు తిప్పి పంపాలని స్పష్టం చేసింది. మరో పిటిషన్‌లో కోదండరాం, అలీఖాన్‌ల నియామకంపై కోర్టు స్టే విధించింది. తాజాగా నియామకాలను రద్దు చేసింది. క్యాబినెట్ ద్వారా ఎమ్మెల్సీలపై సిఫార్సులను పరిగణలోకి తీసుకుని జాబితాను గవర్నర్‌కు పంపాలని ఆదేశించింది.
శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్లను అనుమతించడం ద్వారా వారికి ఊరట రద్దైంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకానికి క్యాబినెట్ మళ్లీ కొత్తగా ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. శ్రవణ్, సత్యనారాయణల నియామకంపై అభ్యంతరాలు ఉంటే క్యాబినెట్‌కు తిప్పి పంపాలని, తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
కొత్త నియామకాలకు బ్రేక్…
ఈ ఏడాది జనవరి 30వ తేదీన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.
ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్ ను గవర్నర్ తమిళ సై గవర్నర్ కోటా(Governor Quota)లో ఎమ్మెల్సీలుగా నియమించారు. ఆ నియామకాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉత్తర్వులు ఇచ్చింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను కేబినెట్ నామినేట్ చేసింది. వీరి పేర్లను గవర్నర్ తమిళి సై ఆమోదానికి పంపారు. అయితే గవర్నర్ తమిళిసై వీరిద్దరికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే అర్హతలు లేవని తిరస్కరించారు.
అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం చకచకా జరిగిపోయింది. తమ పేర్లను గవర్నర్ ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని కోర్టుకు తెలిపారు. కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌లపై హైకోర్టులో విచారణ జరిపారు. హైకోర్టు(TS High Court) ఏ విషయం తేల్చేవరకూ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను(Mlc's) ఎంపిక ఉండబోదని రాజ్ భవన్ వర్గాలు చెప్పాయి. ఈలోపే ప్రొ.కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాకు ప్రతిపాదించింది. ఈ సిఫార్సులకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
తమ పిటిషన్ పెండింగ్ Petition Pending లో ఉండగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఆమోదించడంపై దాసోజు శ్రవణ్ , సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ పై తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం వద్దని హైకోర్టు ఆదేశించింది. తాజాగా ఈ నియామకాలను రద్దు చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కోదండరాం, అలీఖాన్‌లకు మళ్లీ ప్రతిపాదిస్తారా కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.