తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jani Master Case : జానీ మాస్టర్‌కు మరో షాక్‌.. బెయిల్‌ రద్దు కోరుతూ పిటిషన్‌ వేయనున్న పోలీసులు

Jani Master Case : జానీ మాస్టర్‌కు మరో షాక్‌.. బెయిల్‌ రద్దు కోరుతూ పిటిషన్‌ వేయనున్న పోలీసులు

07 October 2024, 15:25 IST

google News
    • Jani Master Case : జానీ మాస్టర్‌కు మరో షాక్‌ తగిలింది. మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్ దాఖలు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలు వేయనున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్‌ నేషనల్‌ అవార్డును క్యాన్సిల్ చేశారు. అవార్డు తీసుకోవడం కోసం 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ అయ్యింది.
జానీ మాస్టర్‌
జానీ మాస్టర్‌ (X)

జానీ మాస్టర్‌

జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్‌ రద్దు కోరుతూ.. పోలీసులు పిటిషన్‌ వేయనున్నారు. మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని.. రంగారెడ్డి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు నిలిపివేత దృష్ట్యా బెయిల్ రద్దు పోలీసులు కోరనున్నారు. జాతీయఅవార్డు తీసుకోవడానికి 4 రోజులు మధ్యంతర బెయిల్‌ను కోర్టు మంజూరు చేసింది. ఈ నెల 10న కోర్టులో హాజరుకావాలని జానీని రంగారెడ్డి కోర్టు ఆదేశించింది.

తిరుచిత్రాబళం సినిమాలో మేఘం కరుగత పాటకు గాను.. బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా నేషనల్ అవార్డుకు జానీ ఎంపికయ్యారు. 2022కు గాను 70వ జాతీయ అవార్డుల్లో జానీకి పురస్కారాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే.. తన వద్ద పని చేసిన కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో జానీ మాస్టర్ గత నెలలో జైలు పాలయ్యారు. పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ తరుణంలో ఆయన జాతీయ అవార్డు రద్దయింది.

జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డును నిలిపివేయడంపై కొరియోగ్రాఫర్, బిగ్‍బాస్ ఫేమ్ ఆట సందీప్ స్పందించారు. అవార్డును వెనక్కి తీసుకోవడం సరికాదంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. “జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ అయందని సోషల్ మీడియాలో చూశా. చాలా బాధగా అనిపించింది. ఓ ఆడపిల్ల విషయం, సెన్సిటివ్ విషయం అని ఇంతకాలం నేను జానీ మాస్టర్ అంశంలో మాట్లాడలేదు. వాళ్లకి వాళ్లకి ఏదో ఉండొచ్చు. లీగల్‍గా జానీ మాస్టర్ ప్రొసీడ్ అవుతారని అనుకున్నా. కానీ ఈరోజు జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేసే రేంజ్‍కు వెళ్లిపోయిందంటే చాలాచాలా బాధపడుతున్నా” అని సందీప్ అన్నారు.

జానీ తోపాటు అతని భార్య తనను కొట్టేవారని బాధితురాలు ఆరోపించింది. ఈ క్రమంలోనే మైనర్‌గా ఉన్నప్పటి నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నారని పోలీసలుకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించింది. దీంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నార్సింగి పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అభ్యర్థన మేరకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే.. జానీని మళ్లీ జైలుకు తరలించే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం