తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gachibowli Rape Case : యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. అప్పటికప్పుడు ప్లాన్ వేసిన నిందితుడు!

Gachibowli Rape Case : యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం.. అప్పటికప్పుడు ప్లాన్ వేసిన నిందితుడు!

15 October 2024, 16:43 IST

google News
    • Gachibowli Rape Case : హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో దారుణం జరిగింది. 30 ఏళ్ల యువతిపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు.
యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం (istockphoto)

యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

ఆ యువతి అమీర్‌పేటలోని ఓ ఆర్కిటెక్ కంపెనీలో జాబ్ చేస్తుంది. పని అయిపోయే సరికి లేట్ అయ్యింది. ఎలాగోలా లింగపల్లి చేరుకుంది. అక్కడి నుంచి నానాక్‌రామ్ గూడ వెళ్లడానికి ఓ ఆటో ఎక్కింది. అప్పటికే అలసిపోయిన యువతి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. మదమెక్కిన ఆటో డ్రైవర్ ఆ యువతిపై ఆశపడ్డాడు. యువతి నిద్రిస్తుండగానే.. నానక్‌రామ్ గూడ వెళ్లాల్సిన ఆటోను.. గచ్చిబౌలి ఏరియాలోని మసీద్ బండ సమీపంలో ఉన్న కుడికుంట చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు.

అప్పటికే సమయం దాదాపు అర్ధరాత్రి 2.30 నిమిషాలు అయ్యింది. నిద్రిస్తున్న యువతిపైకి ఆటో డ్రైవర్ మృగంలా దూకాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన యువతి తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించింది. కానీ.. ఆ మానవ మృగం వదల్లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ యువతి కేకలు వేసింది. భయపడిన ఆటో డ్రైవర్.. తన ఆటోను వేసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఇప్పటివరకు దొరకలేదు.

బాధిత యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధిత యువతి నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. ఇటు నిందితుడి కోసం వెతుకుతున్నారు. నిందితుని కోసం గచ్చిబౌలి పోలీసులు నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు.

అయితే.. నిందితుడి ఆటోకు నంబర్ ప్లేట్ లేదని తెలుస్తోంది. దీంతో అతన్ని పట్టుకోవడం కష్టంగా మారింది. అయినా పోలీసులు ప్రయత్నం మానలేదు. రాత్రి 1.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకు ఆ ఏరియాలో తిరిగిన ఆటోల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో గచ్చిబౌలిలోని మసీద్ బండ ఏరియా ఉలిక్కిపడింది. ఇక్కడ నిర్మానుష్య ప్రాంతాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఎక్కువగా లేవని తెలుస్తోంది.

అయితే.. నిందితుడికి ఈ ఏరియా బాగా తెలిసినట్టు ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని బాధితులు వేడుకుంటోంది.

తదుపరి వ్యాసం