తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc Cargo Service : విజయవంతంగా కార్గో సేవలు.. హైదరాబాద్‌లో 31 కేంద్రాల నుంచి అమలు.. ఛార్జీలు ఇలా..

TGSRTC Cargo Service : విజయవంతంగా కార్గో సేవలు.. హైదరాబాద్‌లో 31 కేంద్రాల నుంచి అమలు.. ఛార్జీలు ఇలా..

01 November 2024, 13:12 IST

google News
    • TGSRTC Cargo Service : ఆదాయం పెంచుకోవడానికి టీజీఎస్ ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేస్తోంది. ఇప్పటికే కార్గో సేవలను అందిస్తున్న ఆర్టీసీ.. తాజాగా ఇంటి వద్దకే పార్సిల్ సర్వీసులను ప్రారంభించింది. ఇది విజయవంతంగా కొనసాగుతోంది. వినియోగదారులు కూడా ఆర్టీసీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
విజయవంతంగా కార్గో సేవలు
విజయవంతంగా కార్గో సేవలు

విజయవంతంగా కార్గో సేవలు

ఇంటివద్దకే ఆర్టీసీ కార్గో సేవలు.. విజయవంతంగా సాగుతున్నాయి. అక్టోబర్ 27న ప్రారంభమైన ఈ సేవలను హైదరాబాద్‌లోని 31 కేంద్రాల నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు మంచి స్పందన ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం వరకు ఈ సర్వీసు అందుబాటులో ఉంది. త్వరలో విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

ఛార్జీలు ఇలా..

0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50

1 కేజీ నుంచి 5 కేజీల‌కు రూ.60

5 కేజీ నుంచి 10 కేజీల‌కు రూ.65

10 కేజీ నుంచి 20 కేజీల‌కు రూ.70

20 కేజీ నుంచి 30 కేజీల‌కు రూ.75

30 కేజీలు దాటితే.. పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ఛార్జీలు ఉంటాయి.

ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్(కార్గో) సేవ‌ల‌ను టీజీఎస్ఆర్టీసీ మ‌రింత‌గా విస్తరిస్తోంది. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్‌లో వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తుంది. ఈ క్రమంలోనే.. పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లో ఈ హో డెలివరీ సేవలను ప్రారంభించారు.

హైద‌రాబాద్‌లోని 31 కేంద్రాల ద్వారా.. హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్‌లో ఎక్కడికైనా హోం డెలివ‌రీ సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్ ప్రజ‌లు ఈ హోం డెలివ‌రీ స‌దుపాయాన్ని వినియోగించుకోవాల‌ని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. సురక్షితంగా డోర్ డెలివరీ చేస్తామని చెబుతున్నారు.

హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలు.. ఎల్బీ నగర్, కాచిగూడ, చిక్కపల్లి, రెజిమెంటల్ బజార్, మియాపూర్ బస్టాండ్, జల విహార్ కూకట్‌పల్లి, జీడీమెట్ల, వనస్థలిపురం, ఉప్పల్, మలక్‌పేట ఏరియాల్లోని కేంద్రాల నుంచి ఇంటి వద్దకే కార్గో సేవలను అందిస్తున్నారు. ఛార్జీలు తక్కువగా ఉండటంతో.. వినియోగదారులు ఆర్టీసీ వైపు మొగ్గుచూపుతున్నారు.

తదుపరి వ్యాసం