TGPSC DAO Exam : డీఏవో పరీక్షల హాల్ టికెట్లు విడుదల - ఇదిగో డౌన్లోడ్ లింక్
26 June 2024, 11:40 IST
- TGPSC DAO Hall Ticket 2024: డీఏవో(Divisional Accounts Officer) రాత పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. టీజీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ప్రకటన విడుదల చేశారు. జూన్ 30వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
డీఏవో హాల్ టికెట్లు విడుదల
TGPSC DAO Hall Ticket 2024: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (Divisional Accounts Officer) పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. జూన్ 30వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జులై 4వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్లను కమిషన్ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
మొత్తం 2 పేపర్లకు ఈ పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామ్ జరగనుంది.
TGPSC DAO Hall Ticket Download - ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు TGPSC అధికారిక వెబ్ పోర్టల్ https://tspsc.gov.in/ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో Divisional Accounts Officer Hall Ticekt ఆప్షన్ కనిపిస్తోంది. దీనిపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ TGPSC ఐడీతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
- మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
తెలంగాణ వర్క్స్ అకౌంట్స్ శాఖలో 53 డీఏఓ పోస్టుల భర్తీకి 2022 ఆగస్టు 4న నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2 అర్థమెటిక్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇమేజింగ్ పత్రాలు
మరోవైపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు వెబ్ సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు వారి లాగిన్ వివరాలతో ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను కూడా పొందవచ్చు.
జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ పూర్తి అయింది. త్వరలోనే ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించనున్నారు. మరోవైపు… మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్:
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను 21/10/2024 నుంచి 27/10/2024 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇటీవలే పరీక్షల షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది.
గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.
- జనరల్ ఇంగ్లిష్(క్వాలిఫైయింగ్ పేపర్) - అక్టోబర్ 21
- పేపర్-I (జనరల్ ఎస్సే) -అక్టోబర్ 22
- పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం) - అక్టోబర్ 23
- పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్) - అక్టోబర్ 24
- పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్) - అక్టోబర్ 25
- పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ ) - అక్టోబ్ 26
- పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం) - అక్టోబర్ 27.
మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. గ్రూప్-1 మెయిన్స్ లో మొత్తం 06 పేపర్లు ఉంటాయి. వీటిని అభ్యర్థి ముందుగా ఎంచుకున్న మాధ్యమంలోనే రాయాల్సి ఉంటుంది.