తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Komatireddy : తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వం- మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy : తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వం- మంత్రి కోమటిరెడ్డి

21 December 2024, 17:21 IST

google News
  • Minister Komatireddy : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ ఘటనలో మృతి చెందిన బాధితురాలు రేవతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమన్నారు.

తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వం- మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వం- మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపునకు అనుమతి ఇవ్వం- మంత్రి కోమటిరెడ్డి

Minister Komatireddy : పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.... తెలంగాణలో ఇకపై సినిమా విడుదలకు ముందు రోజు ఎలాంటి బెనిఫిట్‌ షోలు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడి కుటుంబానికి పరిహారం ఇస్తామన్న హామీని అల్లు అర్జున్‌ నిలబెట్టుకోలేదన్నారు. బాలుడు శ్రీతేజ్‌ వైద్య చికిత్స కోసం అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

"సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబానికి కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరుపున 25 లక్షల రూపాయలు విరాళం అందిస్తున్నాను. అలాగే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారి అబ్బాయి శ్రీతేజ్ కోలుకునేంత వరకు పూర్తి ఆరోగ్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది"- మంత్రి కోమటిరెడ్డి

ప్రతీ నెల రూ.1000 ఆదా

25 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి ప్రతీ నెల కుటుంబానికి 1000 రూపాయలు ఆదా చేస్తున్నామన్నారు. 7 లక్షల అప్పులు చేసి కాళేశ్వరం కడితే కుళేశ్వరం అయ్యిందని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లు పారకుండా ఒక కోటి 50 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన చరిత్ర తెలంగాణ రైతులదన్నారు. అబద్దాల్లో ప్రపంచ ఖ్యాతిగాంచిన కేసీఆర్ సభకు వస్తే అన్ని విషయాలపై స్పష్టంగా మాట్లాడతామన్నారు.

నల్లగొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరా ఆయకట్టుకు బీఆర్ఎస్ పాలనలో సాగునీరు ఇచ్చినట్టు రుజువు చేస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువగా నష్టపోయింది నల్లగొండ అన్నారు. జగన్ మోహన్ రెడ్డితో కుమ్మక్కై పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలతో నీళ్లు రాయలసీమకు తీసుకుపో.. అని కేసీఆర్ చెప్పారన్నారు. నల్లగొండలో రెండు పంటలకు క్రాఫ్ హాలీడే ఇచ్చారన్నారు. సొంత పార్టీపై పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే...పదేళ్ల పాటు అధికారంలో ఉండి నల్లగొండకు న్యాయం చేయలేదని కోమటిరెడ్డి బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు.

తదుపరి వ్యాసం