తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet 2024 Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్... వెబ్‌సైట్‌లో ఆ 'ఆప్షన్' వచ్చేసింది..!

TS TET 2024 Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్... వెబ్‌సైట్‌లో ఆ 'ఆప్షన్' వచ్చేసింది..!

11 April 2024, 13:51 IST

    • Telangana TET 2024 Updates : తెలంగాణ టెట్ దరఖాస్తులకు(TS TET Applications) సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.  
తెలంగాణ టెట్ - 2024
తెలంగాణ టెట్ - 2024

తెలంగాణ టెట్ - 2024

TS TET 2024 Updates : తెలంగాణ టెట్ (TS TET 2024)దరఖాస్తుల గడువును పెంచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అప్డేట్ ఇచ్చింది విద్యాశాఖ. అప్లికేషన్లలో ఏమైనా తప్పులు ఉంటే సవరించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఎడిట్(TS TET 2024 Application Edit option) ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎడిట్ ఆప్షన్ తో మీ దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశం ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఒక్కసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే… మళ్లీ ఎడిట్ చేసుకునే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Finance Fraud : హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన మరో ఫైనాన్స్ సంస్థ, రూ.200 కోట్లు స్వాహా!

TS Cabinet Decisions : ధాన్యం కొనుగోళ్ల బాధ్యత కలెక్టర్లకే, సన్న వడ్లకే రూ.500 బోనస్- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, విచారణ పరిధి జూబ్లీహిల్స్ పీఎస్ కు మార్పు

Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, జూన్ 3 వరకు రిమాండ్ పొడిగింపు

TS TET 2024 Application Edit option : ఇలా ఎడిట్ చేసుకోండి…

  • తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో Edit Application అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ Journal Number/Payment Reference ID మరియు Date of Birth ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
  • మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
  • చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఎడిట్ పూర్తి అవుతుంది.
  • ప్రింట్ అప్లికేషన్ పై క్లిక్ చేసి మీ దరఖాస్తు ఫారమ్ ను పొందవచ్చు.

How to Apply TS TET 2024 : టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి

  • టెట్ రాసే అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ముందుగా ‘Fee Payment’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  • పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పై నొక్కి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా..? లేదా అనేది చెక్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ వివరాలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • అన్ని వివరాలను ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
  • 'Print Application' అనే ఆప్షన్ పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
  • రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.

TS TET Dates 2024 : తెలంగాణ టెట్ ముఖ్య తేదీలు:

  • తెలంగాణ టెట్ దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 20, 2024.
  • హాల్ టికెట్లు - మే 15, 2024.
  • పరీక్షలు ప్రారంభం - మే 20, 2024.
  • పరీక్షల ముగింపు - జూన్ 06,2024.
  • టెట్ ఫలితాలు - జూన్ 12, 2024.
  • అధికారిక వెబ్ సైట్ - https://schooledu.telangana.gov.in/ISMS/ 

 

తదుపరి వ్యాసం