TS TET 2024 Updates : తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేశారా..? ఇవాళే లాస్ట్ డేట్, ప్రాసెస్ ఇదే-telangana tet applications 2024 ends today application direct link are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet 2024 Updates : తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేశారా..? ఇవాళే లాస్ట్ డేట్, ప్రాసెస్ ఇదే

TS TET 2024 Updates : తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేశారా..? ఇవాళే లాస్ట్ డేట్, ప్రాసెస్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 10, 2024 12:16 PM IST

Telangana TET 2024 Updates: తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో(ఏప్రిల్ 10) ముగియనుంది. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

తెలంగాణ టెట్ - 2024
తెలంగాణ టెట్ - 2024

Telangana TET 2024 Updates: తెలంగాణ టెట్ ఆన్ లైన్ దరఖాస్తుల(Telangana TET 2024) గడువు ఇవాళ్టి(ఏప్రిల్ 10)తో పూర్తి కానుంది. అయితే ఈసారి గడువు పెంచే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో… దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇవాళే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. మే 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై…. జూన్‌ 3 వరకు కొనసాగనున్నాయి.

yearly horoscope entry point

How to Apply TS TET 2024 : టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి

  • టెట్ రాసే అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ముందుగా ‘Fee Payment’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  • పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పై నొక్కి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా..? లేదా అనేది చెక్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ వివరాలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • అన్ని వివరాలను ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
  • 'Print Application' అనే ఆప్షన్ పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
  • రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.

ఆసక్తి అంతంతే…!

గతంతో పోల్చితే…ఈసారి తెలంగాణ టెట్ కు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపించటం లేదు. గతేడాది నిర్వహించిన టెట్ పరీక్షకు…. 2,91,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పేప‌ర్ -1కు 82,560 ద‌ర‌ఖాస్తులు, పేప‌ర్- 2కు 21,501 ద‌ర‌ఖాస్తులు రాగా…. ఈ రెండు పేప‌ర్ల‌కు క‌లిపి 1,86,997 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. గ‌తేడాది నిర్వ‌హించిన టెట్‌కు మొత్తంగా చూస్తే….. 3.79 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అయితే ఈసారి నిర్వహించబోయే టెట్ కు ఈస్థాయిలో దరఖాస్తులు వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ కు సంబంధించి… ఏప్రిల్ 9వ తేదీ నాటికి 1.90 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇవాళే చివరి తేదీ కావటంతో…. 2 లక్షల లోపే అప్లికేషన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.మొత్తంగా చూస్తే గతేడాది వచ్చిన దరఖాస్తుల సంఖ్య దాటడం కష్టమే..!

TS TET Dates 2024: టీఎస్ టెట్ ముఖ్య తేదీలు:

తెలంగాణ టెట్ దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 10, 2024.

హాల్ టికెట్లు - మే 15, 2024.

పరీక్షలు ప్రారంభం - మే 20, 2024.

పరీక్షల ముగింపు - జూన్ 06,2024.

టెట్ ఫలితాలు - జూన్ 12, 2024.

అధికారిక వెబ్ సైట్ - https://schooledu.telangana.gov.in/ISMS/

Whats_app_banner