TS TET 2024 : 'తెలంగాణ టెట్' దరఖాస్తుల గడువు పెంపు - ఎప్పటివరకంటే..?-the deadline for telangana tet applications 2024 has been extended till april 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet 2024 : 'తెలంగాణ టెట్' దరఖాస్తుల గడువు పెంపు - ఎప్పటివరకంటే..?

TS TET 2024 : 'తెలంగాణ టెట్' దరఖాస్తుల గడువు పెంపు - ఎప్పటివరకంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Apr 10, 2024 12:33 PM IST

TS TET Applications 2024: తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువుపై కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. గడువును పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.

టెట్‌ దరఖాస్తుల గడువు పెంపు
టెట్‌ దరఖాస్తుల గడువు పెంపు (Photo Source FRom DD News Andhra Twitter)

TS TET Applications 2024 Updates: తెలంగాణ టెట్ దరఖాస్తుల(TS TET Applications) గడువు ఇవాళ్టితో పూర్తి కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్వహించిన టెట్ తో పోల్చితే…ఈసారి అభ్యర్థుల నుంచి పెద్దగా స్పందన లేదు. ఈసారి ఫీజు భారం కూడా ఎక్కువగా ఉంది.

yearly horoscope entry point

ఏప్రిల్ 9వ తేదీ నాటికి తెలంగాణ టెట్ కు లక్షా 90వేలకుపైగా దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కానీ గతేడాది నిర్వహించిన టెట్ పరీక్షకు…. 2,91,058 దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 3 లక్షల వరకు అప్లికేషన్లు రాగా…ఈసారి మాత్రం అంత స్పందన లేదు. పైగా గతంలో కేవలం ఒక్క పేపర్ రాసేందుకు రూ. 200 చెల్లిస్తే సరిపోయేది. కానీ ఈసారి ఏకంగా ఒక్క పేపర్ రాయాలంటే… రూ. 1000 కట్టాల్సి వస్తోంది. రెండు పేపర్లు రాసే వారు రూ. 2వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు భారం ఎక్కవగా ఉండటంతో కూడా చాలా మంది అభ్యర్థులు వెనకడుగు వేసినట్లు తెలిసింది. ఫీజు తగ్గింపు గురించి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా….ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తులు దృష్ట్యా… ప్రభుత్వం టెట్ అప్లికేషన్ల గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగించింది. మే 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

How to Apply TS TET 2024 : టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి

  • టెట్ రాసే అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • ముందుగా ‘Fee Payment’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  • పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పై నొక్కి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా..? లేదా అనేది చెక్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ వివరాలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • అన్ని వివరాలను ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
  • 'Print Application' అనే ఆప్షన్ పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.
  • రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.

TS TET Dates 2024: టీఎస్ టెట్ ముఖ్య తేదీలు:

తెలంగాణ టెట్ దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 20, 2024.

హాల్ టికెట్లు - మే 15, 2024.

పరీక్షలు ప్రారంభం - మే 20, 2024.

పరీక్షల ముగింపు - జూన్ 06,2024.

టెట్ ఫలితాలు - జూన్ 12, 2024.

అధికారిక వెబ్ సైట్ - https://schooledu.telangana.gov.in/ISMS/

Whats_app_banner