TSPSC Group 1 Updates : గ్రూప్ 1కి దరఖాస్తు చేశారా..? 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది, లింక్ ఇదే
TSPSC Group 1 Updates 2024: గ్రూప్ - 1 దరఖాస్తులకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.
TSPSC Group 1 Applications: తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ(TSPSC Group 1 Applications) ముగిసిన సంగతి తెలిసిందే. కొత్త నోటిఫికేషన్ కు సంబంధించి మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఈ అప్లికేషన్లకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు దొర్లితే ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ప్రత్యేక ఆప్షన్ ను తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా…. తప్పులను సవరించుకునే అవకాశం ఉంటుంది.
TSPSC Group 1 Applications Edit Option: ఇలా ఎడిట్ చేసుకోండి….
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి
- హోంపేజీలో కనిపించే గ్రూప్ 1 సర్వీస్ ఆన్ లైన్ ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- TSPSC ID, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేస్తే… మీ దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- తప్పులు దొర్లిన కాలమ్స్ ను సవరించుకోవచ్చు.
- తిరిగి సబ్మిట్ బటన్ నొక్కితే వివరాలు మారిపోతాయి. కేవలం ఒక్కసారి మాత్రం ఎడిట్ ఆప్షన్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
ఈ ఎడిట్ ఆప్షన్ అవకాశం మార్చి 27 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ లోపు మాత్రమే ఎడిట్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. ఒక్కసారి ఎడిట్ ఆప్షన్ గడువు ముగిసిన తర్వాత… సవరణలకు అవకాశం ఉండని వెల్లడించింది.
గ్రూప్ 1 నోటిఫికేషన్ ముఖ్య తేదీలు:
- గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 19,2024.
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 23, 2024.
- దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - మార్చి 17,2024.
- దరఖాస్తుల ఎడిట్ - మార్చి 23 నుంచి మార్చి 27,2024.
- హాల్ టికెట్లు డౌన్లోడ్ - పరీక్షకు 7 రోజుల ముందు నుంచి అందుబాటులోకి వస్తాయి.
- గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష - జూన్ 09 2024.
- మెయిన్స్ పరీక్షలు - అక్టోబరు 21, 2024 నుంచి ప్రారంభం అవుతాయి.
- అధికారిక వెబ్ సైట్ - https://www.tspsc.gov.in/
తెలంగాణ గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభమైంది. మార్చి 16 తేదీతో గడువు ముగిసింది. ఈనోటిఫికేషన్ లో భాగంగా 563 ఉద్యోగాలను భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ(TSPSC). జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష ఉండగా, అక్టోబరు 21వ తేదీ నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. పరీక్షలకు ఏడు రోజుల ముందుగా వెబ్ సైట్ లో హాల్ టికెట్లను తీసుకురానుంది.
గ్రూప్ 4 అప్డేట్స్….
TSPSC Group 4 Updates: మరోవైపు గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మహిళలకు సమాంతర రిజర్వేషన్లు ఇచ్చిన నేపథ్యంలో…. సవరణ ఖాళీల జాబితా (రివైజ్డ్ బ్రేకప్)ను ప్రకటించింది. మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాల జాబితాను వెబ్ సైట్ లో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది.