APPSC Group 1 Prelims Key : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం!-amaravati appsc group 1 prelims primary key releases candidates objections window open ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Group 1 Prelims Key : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం!

APPSC Group 1 Prelims Key : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల, అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం!

Bandaru Satyaprasad HT Telugu
Mar 19, 2024 04:41 PM IST

APPSC Group 1 Prelims Key : ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదలైంది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో కీ చెక్ చేసుకోవచ్చు.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల,
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల,

APPSC Group 1 Prelims Key : ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ(APPSC Group-1 Key) ని ఏపీపీస్సీ విడుదల చేసింది. ప్రైమరీ కీ ని ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది. అభ్యర్థులు కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించింది. మార్చి 19 నుంచి మార్చి 21వ తేదీ లోగా ఆన్ లైన్ లో అభ్యర్థులు తెలపవచ్చని పేర్కొంది. మార్చి 17న ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్(AP Group-1 Prelims) పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

కీ పై అభ్యంతరాలు

ఏపీపీఎస్సీ గ్రూప్ -1 పోస్టుల భర్తీ కోసం మార్చి 17న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్ష ప్రాథమిక కీ (Group 1 Key)మార్చి 18న కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచింది. ప్రాథమిక కీలో సమాధానాలపై ఏదైనా అభ్యంతరం ఉంటే అభ్యర్థులు దాఖలు చేయవచ్చని కమిషన్ తెలిపింది. ఏపీపీఎస్సీ వెబ్ లైన్ లో లింక్ ద్వారా అభ్యర్థి లాగిన్ సమాచారంతో అభ్యంతరాలు (Objections on Group 1 Key)తెలియజేవచ్చు. ఆన్‌లైన్ ద్వారా మూడు రోజుల పాటు మార్చి 19 నుంచి మార్చి 21 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. పోస్ట్/వాట్సాప్/SMS/ ద్వారా అభ్యంతరాలు స్వీకరించరు. ఫోన్/వ్యక్తిగత సమర్పణలు లేదా ఏదైనా ఇతర మోడ్ అభ్యంతరాలు స్వీకరించమని కమిషన్ పేర్కొంది. గడువు తేదీ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిగణించమని తెలిపింది.

89 పోస్టుల భర్తీ

ఏపీపీఎస్సీ గ్రూప్-1(APPSC Group-1 Exam) పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. 91,463 మంది ప్రిలిమ్స్(Prelims) పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ కు 72.55 శాతం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని 18 జిల్లాల్లోని 301 కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. ఏపీపీఎస్సీ 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(AP Group-1 Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఎనిమిది కొత్త ఖాళీలను జోడించింది. దీంతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 ద్వారా భర్తీ చేయాల్సిన మొత్తం ఖాళీల సంఖ్య 89కు చేరింది. ప్రిలిమ్స్ ప్రైమరీ కీల విడుదల చేసిన ఏపీపీఎస్సీ అభ్యంతరాలు స్వీకరిస్తోంది. ఆ తర్వాత కమిషన్ అభ్యర్థుల అభిప్రాయాన్ని సమీక్షిస్తుంది. అనంతరం గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్ష తుది కీ, ఫలితాలు విడుదల చేయనుంది. ప్రిలిమ్స్ ఫలితాల విడుదల తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేయనుంది.

గ్రూప్-1 మెయిన్స్

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్(Group -1 Mains) పరీక్ష రాసేందుకు అనుమతినిస్తారు. మెయిన్స్ రాత పరీక్షలో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి. వీటితో పాటు లాంగ్వేజెస్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ నిర్వహిస్తారు. అయితే ఈ పేపర్లను క్వాలిఫైయింగ్ పరీక్షలుగా పరిగణిస్తారు. మొత్తం ఐదు పేపర్లలో ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులకు మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం