Special Trains: సికింద్రాబాద్ – యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
24 August 2022, 9:04 IST
- special trains from secunderabad: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ -యశ్వంత్‌పూర్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను విడుదల చేసింది.
సికింద్రాబాద్ యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్స్
South Central Railway Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ల గడువును పొడిగించింది. తాజాగా సికింద్రాబాద్ - యశ్వంత్ పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ప్రకటించింది.
secunderabad to yesvantpur trains: సికింద్రాబాద్–యశ్వంత్‌పూర్ స్పెషల్ ట్రైన్ ఈనెల 29న మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరుతుంది. తర్వాత రోజు ఉదయం 4 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇక యశ్వంత్ పూర్ నుంచి ఈనెల 30వ తేదీన సాయంత్రం 5.20 గంటలకు స్పెషల్ ట్రైన్ బయల్దేరుతుంది. మరుసటిరోజు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఆగేది స్టేషన్లు ఇవే....
ఈ ప్రత్యేక రైలు... కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, అనంతపూర్, ధర్మవరం, హిందూపురం, ఎల్హాంక స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైలులో 2ఏసీ, 3 ఏసీ, స్లీప్ క్లాస్ తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రయాణికులను కోరారు.
హైదరాబాద్-నాగర్ సోల్…
South Central Railway Special Trains : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. హైదరాబాద్-నాగర్ సోల్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. రైలు నెంబర్ 07089 ఆగస్టు 24న హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09.25 గంటలకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07090 ఆగస్టు 25న నాగర్ సోల్ లో రాత్రి 10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటుంది.
ఈ రైళ్లు లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, భాల్కి, ఉద్గీర్, లాతూర్ రోడ్, పర్లి, గంగఖేర్, పర్భాని, సెలు, పర్తూర్, జల్నా, ఔరంగబాద్ రైల్వే స్టేషనల్లో ఆగుతుంది. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లిపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి.