SCR Special Trains : ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రత్యేక రైళ్లు పొడిగింపు - వివరాలివే
20 July 2024, 6:35 IST
- South Central Railway Special Trains : దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను పొడిగించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల నుంచి ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి.
ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
South Central Railway Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రూట్ల వివరాలు, తేదీలను పేర్కొంది.
రైళ్ల వివరాలు….
సికింద్రాబాద్ నుంచి పట్నా మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును పొడిగించినట్లు దక్షిమ మధ్య రైల్వే ప్రకటన చేసింది.5 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో ఈ ప్రత్యేక రైలు సేవలు అందిస్తుందని పేర్కొంది.
ఇక హైదరాబాద్ - పట్నా మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీస్ ను కూడా పొడిగించింది. ఆగస్టు 7 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతి బుధవారం నడుస్తుందని పేర్కొంది.
ఇక సికింద్రాబాద్ - పాట్నా మధ్య నడిచే రైలును కూడా పొడిగించారు.ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఈ ట్రైన్ సేవలు అందిస్తుంది. ప్రతి శుక్రవారం రాకపోకలు ఉంటాయి.
దానాపూర్-సికింద్రాబాద్ (03225) రైలు ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ 26 వరకు ప్రతి గురువారం నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక సికింద్రాబాద్ – దానాపూర్ (ట్రైన్ నెంబర్ 3226) రైలు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు ప్రతి ఆదివారం రైలు నడుస్తుందని పేర్కొంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను పొడిగించినట్లు తెలిపింది. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలి కోరింది.
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం, ఆదాయం లేకపోవడం, రైలు ప్రయాణ సమయం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో పలు స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకల్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు రైల్వే స్టేషన్లను పూర్తిగా మూసేశారు. దీనిపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమైనా రైల్వే శాఖ వెనక్కి తగ్గలేదు.
మరోవైపు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గతంలో ఇచ్చిన అనుమతుల గడువు ముగియడంతో రాకపోకలు ఆగిపోతాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 69 రైళ్లకు అయా స్టేషన్లలో రాకపోకల్ని మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
రైళ్ల రద్దుపై ప్రయాణికులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా మరికొంత కాలం పాటు అయా స్టేషన్లలో వాటిని ఆపేందుకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చింది. ఈనెల 19 నుంచి 29 వరకు మొత్తం 69 రైళ్లకు గతంలో జారీ చేసిన గడువు ముగుస్తోంది.
ప్రయాణికుల నుంచి డిమాండ్ ఉన్న స్టేషన్లలో రైళ్లను ఆపేందుకు అనుమతిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు కొత్తగా మరో 30 స్టేషన్లలో ఇకపై ఆగుతాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 60 రైళ్లకు కొత్తగా హాల్టింగ్ ఇవ్వగా, ఇందులో విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు 40కి పైగా ఉన్నాయి. ఈ సదుపాయం ప్రయోగాత్మకంగానే అమల చేస్తున్నామని, ప్రయాణికుల డిమాండ్‌తో పాటు ప్రయాణించే వారి సంఖ్యను బట్టి తర్వాత పునరాలోచన చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు.
వివరాలివే :
- బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి(12708), సికిం ద్రాబాద్-రాయ్ పుర్(12771) , ఖమ్మంలో ఎర్నాకుళం- పట్నా(22669), మధిరలో తిరుపతి-సికింద్రాబాద్ (12763) ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-మహబూబ్ నగర్(12861) ఎక్స్‌ప్రెస్ ఆగుతాయి.
- మంచిర్యాలలో హజ్రత్ నిజాముద్దీన్- తిరుపతి(12763), ఎర్నాకుళం-పట్నా(22669) ఆగుతుంది.
- రామ గుండం స్టేషన్లో బెంగళూరు-దానాపూర్(12295), హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్(12721), మైసూర్-దర్బంగ(12578), బెనారస్-మనా డపం(22535), ఎర్నాకుళం-పట్నా(22669) రైళ్లు ఆగుతాయి.
- మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో చెన్నై సెంట్రల్-హైదరా బాద్(12603), భువనేశ్వర్-సికింద్రాబాద్(17015), నాగర్సోల్-నర్సాపుర్(17232) రైళ్లు ఆగుతాయి.
- షాద్‌నగర్‌లో యలహంక-కాచిగూడ (17604), వరంగల్లో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-హజ్రత్ నిజాముద్దీన్(12611), హజ్రత్ నిజాముద్దీన్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12612) ఆగుతాయి.
- పెద్దపల్లి స్టేషన్లో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్(12655), సికింద్రాబాద్-రాయ పుర్(12771), అహ్మదాబాద్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12656), సికింద్రాబాద్-రాయ పూర్(12771), రాయపుర్-సికింద్రాబాద్(12772), సికింద్రాబాద్-హిస్సార్ (22737), హిస్సార్-సికింద్రా (22738), హైదరాబాద్-రాక్బల్(17005), రాక్సల్-హైదరాబాద్(17006) రైళ్లను ఆపుతారు.
- పూరి-తిరుపతి (రైలు నెంబరు 17479), తిరుపతి-కాకినాడ టౌన్ (రైలు నెంబరు 17249), బిలాస్పూర్- తిరుపతి (రైలు నెంబరు 17481)కు చినగంజాం స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు. గుంటూరు-రాయగడ (రైలు నెంబరు 17243)కు భీమడోలు స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు. గుంటూరు-నరసాపూర్ (రైలు నెంబరు 17281)కు పుట్లచెరువు స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు. కాత్రా-కన్యాకుమారి (రైలు నెంబరు 18818)కు గూడూరు జంక్షన్లో, విజయవాడ-కాకినాడ పోర్టు (రైలు నెంబరు 17257)కు పసివేదల స్టేషన్, విజయవాడ- మచిలీపట్నం (రైలు నెంబరు 07866) కు ఉప్పులూరు స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు.
- భువనేశ్వర్-సికింద్రాబాద్ (రైలు నెంబరు 17015)ను నడికుడి స్టేషన్లో, భువనేశ్వర్-సికింద్రాబాద్ (రైలు నెంబరు 17015)కు పిడుగురాళ్ల, సత్తెనపల్లి స్టేషన్లలో స్థాపింగ్ కల్పించారు. నాగర్సేల్-నర్సాపూర్ (రైలు నెంబరు 17232)కు కూడా సత్తెనపల్లి స్టేషన్తో పాటు నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లలో హాల్ట్ కల్పిం చారు.
- ధర్మవరం-శేపల్లె (రైలు నెంబరు 17216)కు గెద్దలూరు స్టేషన్లో, లింగంపల్లి- నర్సాపూర్ (రైలు నెంబరు 17256), చెంగల్పట్టు-కాకినాడ (రైలు నెంబరు 17643)కు మంగళగిరి స్టేషన్లో హాల్ట్ కల్పించారు.
- ధర్మవరం-మచిలీపట్నం (రైలు నెంబరు 17216)ను మార్కాపురం రోడ్డు స్టేషన్లో, భువనేశ్వర్-సికింద్రాబాద్ (రైలు నెంబరు 17015)కు మిర్యాలగూడ స్టేషన్లో, నర్సాపూర్-లింగంపల్లి (రైలు నెంబరు 17255) కు నల్గొండ స్టేషన్లో, చెంగల్పట్టు కాకినాడ (రైలు నెంబరు 17643)ను న్యూ గుంటూరు స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు.
- యశ్వంత్ పూర్-మచిలీపట్నం (రైలు నెంబరు 17212)కు కంభం స్టేషన్లో హాల్ట్ ఇచ్చారు. మొత్తం 69రైళ్లకు ప్రయోగాత్మకంగా మరికొన్ని రోజుల పాటు అయా స్టేషన్లలో ఆపుతారు. రద్దీకి అనుగుణంగా వాటి కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు.