Secunderabad To Goa New Train : గోవా ప్రియులకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్ టు వాస్కోడగామా బైవీక్లీ ఎక్స్ ప్రెస్-secunderabad railway running new express to goa by weekly on request of kishan reddy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Secunderabad To Goa New Train : గోవా ప్రియులకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్ టు వాస్కోడగామా బైవీక్లీ ఎక్స్ ప్రెస్

Secunderabad To Goa New Train : గోవా ప్రియులకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్ టు వాస్కోడగామా బైవీక్లీ ఎక్స్ ప్రెస్

Bandaru Satyaprasad HT Telugu
Jul 06, 2024 03:31 PM IST

Secunderabad To Goa New Train : గోవా ప్రియులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి ఇకపై వారానికి రెండు సార్లు గోవా రైలు నడపనున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఈ సర్వీస్ నడిపేందుకు అంగీకరించింది.

గోవా ప్రియులకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్ టు వాస్కోడగామా బైవీక్లీ ఎక్స్ ప్రెస్
గోవా ప్రియులకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్ టు వాస్కోడగామా బైవీక్లీ ఎక్స్ ప్రెస్

Secunderabad To Goa New Train : తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ వారానికి ఒక రైలు 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్ లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. ఇది కాకుండా కాచీగూడ - యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు.

ఇలా సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మార్చి 16, 2024 లేఖ రాశారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రైల్వేశాఖ ఈ ప్రతిపాదనను పక్కన పెట్టింది. మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి రావడంతో.. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు.

త్వరలో పట్టాలెక్కనున్న రైలు

దీంతో సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది. ఈ నిర్ణయంపై కేంద్రమంత్రి బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల స్టాపులు

ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఈ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం