తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains : సికింద్రాబాద్, తిరుపతి, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు

SCR Special Trains : సికింద్రాబాద్, తిరుపతి, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు

12 October 2022, 7:31 IST

    • south central railway special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల రద్ద నేపథ్యంలో తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ - తిరుపతి, హైదరాబాద్ - గోరఖ్ పూర్, బెంగళూరు- జోద్ పూర్, బెంగళూర్ - విశాఖపట్నం నగరాల మధ్య స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది. ఈ మేరకు వివరాలు చూస్తే.......

ట్రెండింగ్ వార్తలు

Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

secunderabad tirupati special trains: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య అక్టోబర్ 12వ తేదీన ప్రత్యేక రైలును ప్రకటించారు. సాయంత్రం 06.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరునాడు ఉదయం 06.45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇక తిరుపతి నుంచి అక్టోబర్ 13వ తేదీన సాయంత్రం 05.15 నిమిషాలకు ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. ఇది మరునాడు ఉదయం 05.55 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు... జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట్ల స్టేషన్లలో ఆగుతాయి.

hyderabad -gorakhpur specail trains: హైదరాబాద్ - గోరఖ్ పూర్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్ నుంచి రాత్రి 09.05 గంటలకు బయల్దేరి... 15వ తేదీ ఉదయం 06.30 గంటలకు గోరఖ్ పూర్ చేరుతుంది. ఇక గోరఖ్ పూర్ నుంచి అక్టోబర్ 16వ తేదీన ఉదయం 08.30 గంటలకు బయల్దేరి... మరునాడు సాయంత్రం 04.20 గంటలకు చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు... సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల, బాలర్షా, నాగ్ పూర్, భోపాల్, బీనా, వీరంగా, లక్ష్మీబాయి, ఓరాయి, పొఖ్రాయన్, కాన్పూర్, అయిశ్ బాగ్, లక్నో సిటీ, బర్ బంకీ, గోండా స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటించారు.

bengaluru jodhpur special Trains: బెంగళూరు - జోద్ పూర్ మధ్య అక్టోబర్ 12వ తేదీన ప్రత్యేక రైలు నడపనున్నారు. ఇది బెంగళూరు నుంచి ఉదయం 11.30 గంటలకు బయల్దేరి... రెండోరోజు ఉదయం 04.15 గంటలకు జోద్ పూర్ చేరుతుంది.

Bengaluru - visakha special trains: మరోవైపు బెంగళూరు - విశాఖ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు అధికారులు, ఈ రైలు అక్టోబర్ 15వ తేదీన బెంగళూరు నుంచి మధ్యాహ్నం 03.50 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్.... కృష్ణరాజాపురం, బంగారాపేట్, జోలార్ పేట్, కట్పాడీ, రేణిగుంట, గుడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామల్ కోట్ తో పాటు దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని తెలిపారు.