Telugu News  /  Telangana  /  Scr Announced Special Trains Between Various Destinations
దక్షిమ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు,
దక్షిమ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు,

SCR Special Trains: బాసర, సికింద్రాబాద్, కాజీపేట్ మీదుగా ప్రత్యేక రైళ్లు

08 October 2022, 16:51 ISTHT Telugu Desk
08 October 2022, 16:51 IST

south central railway special trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల వివరాలను ప్రకటించింది.

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల రద్ద నేపథ్యంలో తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. నాందేడ్ - నర్సాపూర్, తిరుపతి - శ్రీకాకుళం, శ్రీకాకళం - తిరుపతి, తిరుణవెల్లి - దానాపూర్, దానాపూర్ - తంబారం ప్రాంతాల మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. వాటిని చూస్తే......

ట్రెండింగ్ వార్తలు

నాందేడ్ - నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నారు అధికారులు. ఈ ట్రైన్ 10వ తేదీన అందుబాటులో ఉంటుంది. నాందేడ్ నుంచి మధ్యాహ్నం 01.15 నిమిషాలకు బయల్దేరి మరునాడు ఉదయం 05.45 నిమిషాలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ ముద్ ఖేడ్, ధర్మబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, కైకలూరు, అకివీడు, భీమవరం, పాలొకొల్లు స్టేషన్లలో ఆగుతుంది.

శ్రీకాకుళం - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఇది అక్టోబర్ 9, 10 వ తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ రాత్రి 08 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరునాడు మద్యాహ్నం 12.30 నిమిషాలకు శ్రీకాకుళానికి చేరుకుంటుంది. ఇక శ్రీకాకుళం నుంచి 10 వ తేదీన మద్యాహ్నం 03 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 08 గంటలకు తిరుపతికి చేరుతుంది.

ఈ ట్రైన్లు రేణిగుంట, గుడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్ కోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటించారు.

తిరుణవెల్లి దానాపూర్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ ట్రైన్ అక్టోబర్ 18, 25 వ తేదీల్లో రాకపోకలను సాగించనుంది. దానాపూర్ - తిరుణవెల్లి ట్రైన్ అక్టోబర్ 21వ తేదీన అందుబాటులో ఉంటుంది.