SCR Special Trains: సికింద్రాబాద్, యశ్వంతపూర్, పూర్ణ, తిరుపతికి ప్రత్యేక రైళ్లు-south central railway announced special trains between secunderabad yesvantpur ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  South Central Railway Announced Special Trains Between Secunderabad Yesvantpur

SCR Special Trains: సికింద్రాబాద్, యశ్వంతపూర్, పూర్ణ, తిరుపతికి ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Oct 09, 2022 06:30 AM IST

south central railway special trains: దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల వివరాలను ప్రకటించింది.

సికింద్రాబాద్ యశ్వంతపూర్ ట్రైన్స్,
సికింద్రాబాద్ యశ్వంతపూర్ ట్రైన్స్,

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల రద్ద నేపథ్యంలో తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ - నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను చూస్తే....

ట్రెండింగ్ వార్తలు

secunderabad yesvantpur special trains:సికింద్రాబాద్ - యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. అక్టోబర్ 10వ తేదీన సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 10.30 గంటలకు యశ్వంతపూర్ కు చేరుకుంటుంది.

ఇక యశ్వంతపూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య కూడా స్పెషల్ ట్రైన్ ఉంది. ఇది అక్టోబర్ 11వ తేదీ నుంచి సాయంత్రం 5 గంటలకు యశ్వంతపూర్ నుంచి బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 07.30 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్స్ కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, డోన్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, ఎల్హాంక స్టేషన్లలో ఆగుతుంది. ఈ స్పెషల్ ట్రైన్లలో ఫస్ట్ ఏసీ, 2టైర్ ఏసీ, 3టైర్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయి. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

Special Train from Purna to Tirupati: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పూర్ణ - తిరుపతి మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ ప్రకటించింది అధికారులు. అక్టోబర్ 10 వ తేదీన పూర్ణ నుంచి రాత్రి 11.30 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు రాత్రి 10.10 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్ పర్బాణీ, గంగాఖేర్, పర్లీ, వైజనాథ్, లాథూర్ రోడ్, బాల్కీ, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, షాద్ నగర్, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, తాడిపత్రి, ఎర్రగుంట, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్ లో స్లీపర్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం