తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains : పండగ స్పెషల్.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

SCR Special Trains : పండగ స్పెషల్.. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu

19 October 2022, 9:50 IST

    • South Central Railway : పండగ రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వివిధ గమ్యస్థానాలకు 14 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

Special Trains : పండుగ సీజన్‌లో అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడపనుంది. అక్టోబర్ 24 మరియు 31 తేదీలలో సికింద్రాబాద్-కటక్, అక్టోబర్ 25 , నవంబర్ 1 తేదీలలో కటక్-సికింద్రాబాద్, నవంబర్ 3 నుండి డిసెంబర్ 1 మధ్య సుబేదర్ గంజ్-సికింద్రాబాద్, నవంబర్ 4 నుండి డిసెంబర్ 2 మధ్య సికింద్రాబాద్-సుబేదర్ గంజ్ ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

ORR Toll Charges Hike : ఇక బాదుడే బాదుడు-ఓఆర్ఆర్, విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ఛార్జీల మోత

Siddipet : అమ్మ, నాన్నపై ప్రేమతో..! సిద్ధిపేటలో గుడి కట్టించిన కుమారులు

TG Formation Day celebrations : ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు - అధికారికంగా రాష్ట్ర గీతం విడుదల, పాట ఇదే

Mahabubnagar MLC Bypoll : ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు తొలి విక్టరీ - మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం కైవసం

సికింద్రాబాద్-కటక్ మధ్య నడిచే రైళ్లు పలు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలురు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్కోట్, తుని, అనకపల్లి, దువ్వాడ, కొట్టవలస, విజయనగరం, చీపురపల్లి, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మాపూర్, కుద్ర రోడ్, భువనేశ్వర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

సుబేదర్ గంజ్ -సికింద్రాబాద్ మధ్య నడిచే రైళ్లు ఫతేపుర్, కాన్పూర్ సెంట్రల్, భీమ్సేన్, పోఖ్ రయన్, ఓరయి, విరంగ లక్ష్మీబాయి, బిన, భోపాల్, ఇత్రసి, జుఝర్పుర్, నాగ్ పూర్, బల్లార్ష, సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట స్టేషన్లలో ఆగుతాయి.

secunderabad - tirupati sepcail trains: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైలు అక్టోబర్ 19వ తేదీన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 08.25 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 07.50 నిమిషాలకు తిరుపతి చేరుతుంది. ఈ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఇక తిరుపతి నుంచి అక్టోబర్ 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు బయల్జేరి.. మరునాడు ఉదయం 05.45 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, వెంకటగరి, గుడూరు, నెల్లూరు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగాం స్టేషన్లలో ఆగుతుంది.

secunderabad - santragachi special trains: సికింద్రాబాద్ - సంత్రగాచి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ రైళ్లు అక్టోబర్ 21వ తేదీన ఉదయం 08.40 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10.25 నిమిషాలకు సంత్రగాచి చేరుతుంది. ఇక సంత్రగాచి నుంచి అక్టోబర్ 22వ తేదీన సాయంత్రం 6 గంటలకు బయల్దేరి... మరునాడు రాత్రి 09.00 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లు....నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్ కోట్, దువ్వాడ, విశాఖ, విజయనగరం, ఖుద్రారోడ్, కటక్, భద్రక్, బాలాసోర్, కరగ్ పూర్ స్టేషన్లలో ఆగుతుంది.

తదుపరి వ్యాసం