Dasara Special Trains: సికింద్రాబాద్, తిరుపతి, యశ్వంతపూర్ కు ప్రత్యేక రైళ్లు-south central railway announced ten dasara special trains between various destinations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  South Central Railway Announced Ten Dasara Special Trains Between Various Destinations

Dasara Special Trains: సికింద్రాబాద్, తిరుపతి, యశ్వంతపూర్ కు ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Oct 01, 2022 06:34 PM IST

south central railway special trains: దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల వివరాలను ప్రకటించింది.

దసరా స్పెషల్ ట్రైన్స్
దసరా స్పెషల్ ట్రైన్స్ (HT)

South Central Railway Special Trains Latest: మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... దసరా పండగ నేపథ్యంలో తాజాగా 10 స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. వాటిని చూస్తే.....

secunderabad tirupati trains: సికింద్రాబాద్ నుంచి తిరుపతి ( ట్రైన్ నెంబర్ 02764 ) మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు. ఈ రైలు అక్టోబర్ 1న రాత్రి 8న గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌( రైలు నెంబర్ 02763)కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు అక్టోబర్ 2న తిరుపతిలో సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబ్‌నగర్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటించారు.

secunderabad to yesvantpur trains: సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ మధ్య వీక్లీ ట్రైన్స్ నడపనుంది. రైలు నెంబర్ 07233 సికింద్రాబాద్ నుంచి యశ్వంత్‌పూర్ ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేక రైలు అక్టోబర్ 6, 13, 20 తేదీల్లో రాకపోకలు కొనసాగిస్తుంది.రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్‌లో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. యశ్వంత్‌పూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే స్పెషల్ రైలు అక్టోబర్ 7, 14, 21 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3.50 గంటలకు యశ్వంత్‌పూర్‌లో రైలు బయల్దేరి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 4.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, డోన్, అనంతపురం, హిందూపూర్, యలహంక స్టేషన్లలో ఆగుతుంది.

<p>ప్రత్యేక రైళ్ల వివరాలు&nbsp;</p>
ప్రత్యేక రైళ్ల వివరాలు&nbsp; (scr.indianrailways.gov.in)

secunderabad to narasapur trains: సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు. ఈ రైలు అక్టోబర్ 1న రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.

ఈ ట్రైన్ పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.

సికింద్రాబాద్ నుంచి షాలిమార్(ట్రైన్ నెంబర్ 07741) మధ్య ప్రత్యేక రైలు ప్రకటించారు.ఈ రైలు అక్టోబర్ 2న తెల్లవారుజామున 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు షాలిమార్ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07742 షాలిమార్ నుంచి సికింద్రాబాద్ ప్రయాణిస్తుంది. ఈ రైలు అక్టోబర్ 3న మధ్యాహ్నం 2.55 గంటలకు షాలిమార్‌లో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం