SCR Special Trains: హైదరాబాద్, తిరుపతి, నాందేడ్, పూరీకి స్పెషల్ ట్రైన్స్-south central railway to run special trains between hyd tirupati nandead puri ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains: హైదరాబాద్, తిరుపతి, నాందేడ్, పూరీకి స్పెషల్ ట్రైన్స్

SCR Special Trains: హైదరాబాద్, తిరుపతి, నాందేడ్, పూరీకి స్పెషల్ ట్రైన్స్

Mahendra Maheshwaram HT Telugu
Sep 24, 2022 06:30 PM IST

SCR Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్, తిరుపతి, యశ్వంతపూర్, నాందేడ్, పూరీ నగరాలు ఉన్నాయి.

<p>దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు&nbsp;</p>
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (twitter)

South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి, హైదరాబాద్ - యశ్వంతపూర్, నాందేడ్ - పూరీ, పూరీ - నాందేడ్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది ఈ వివరాలను చూస్తే....

secundrabad tirupati trains: సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు అధికారులు. సెప్టెంబర్ 25వ తేదీన సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 05.50 నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 07.20 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.

ఇక తిరుపతి నుంచి సెప్టెంబర్ 26వ తేదీన రాత్రి 08.15 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.20 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.

ఈ ట్రైన్ జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ స్పెషల్ ట్రైన్ లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.

Yesvantpur to Hyderabad trains: హైదరాబాద్ - యశ్వంతపూర్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించారు. ఈ స్పెషల్ ట్రైన్ సెప్టెంబర్ 25, 27 వ తేదీల్లో హైదరాబాద్ నుంచి రాత్రి 09.5 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 10.50 గంటలకు యశ్వంతపూర్ కు చేరుతుంది.

ఇక యశ్వంతపూర్ నుంచి సెప్టెంబర్ 26, 28వ తేదీల్లో మధ్యాహ్నం 03.50 నిమిషాలకు స్పెషల్ ట్రైన్ బయల్దేరి... మరునాడు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.

ఈ ట్రైన్ సికింద్రాబాద్, కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, అనంతపూర్, ధర్మవరం, పెనుకొండ, హిందూపూర్, ఎల్హాంక స్టేషన్లలో ఆగుతుంది.

nanded puri special train: నాందేడ్ - పూరీ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. సెప్టెంబర్ 26వ తేదీన మధ్యాహ్నం 03.25 గంటలకు నాందేడ్ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు సాయంత్రం 05. 30 గంటలకు పూరీకి చేరుకుంటుంది. ఇక పూరీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీన రాత్రి 10.45 గంటలకు బయల్దేరుతుంది. రెండోరోజు అర్ధరాత్రి 1 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.

ఈ ట్రైన్ ముద్ ఖేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరూ, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస, బెరంపూర్, ఖుర్దా స్టేషన్లలో ఆగుతుంది.

ఈ ప్రత్యేక రైళ్లల్లో 2ఏసీ, 3ఏసీ, స్లిపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.

Whats_app_banner

సంబంధిత కథనం