Hyderabad Safest City : దేశంలో అత్యంత సేఫ్ సిటీగా హైదరాబాద్
Hyderabad City : ఇండియాలోని అన్ని మెట్రో నగరాలతో పోల్చుకుంటే.. హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ గా ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం సురక్షిత ప్రాంతంగా భాగ్యనగరం నిలుస్తోంది.
దేశంలోని అన్ని మెట్రో నగరాలలో(Metro Cities) హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ గా నిలుస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(National Crime Records Bureau)ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. కోల్‌కతా, పూణే తర్వాత దేశంలోనే సురక్షితమైన మెట్రో నగరాల్లో భాగ్యనగరం ఉంది. వాటి తర్వాత హైదరాబాద్(Hyderabad) మూడో స్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ ఏర్పాటైన తర్వాత.. టీఆర్ఎస్ ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణను సీరియస్ గా తీసుకుంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం(NCRB Report) గత ఏడాది భాగ్యనగరంలో 2,599 నేరాలు నమోదయ్యాయి. కోల్‌కతా, పూణే(Pune) తర్వాత దేశంలోని మూడో సురక్షితమైన మెట్రో నగరంగా హైదరాబాద్ నిలిచింది. కోల్‌కతా 1,034 నేరాలతో అతి తక్కువ నేరాలు జరిగే మెట్రో నగరంగా అగ్రస్థానంలో నిలిచింది.
1,034 నేరాలతో కోల్‌కతా (Kolkata) అతి తక్కువ నేరాలకు గురయ్యే మెట్రో నగరంగా అగ్రస్థానంలో ఉంది. 2,568 నేరాలతో పూణే రెండో స్థానంలో ఉంది. 2021 నివేదికను ఎన్సీఆర్బీ విడుదల చేసింది. దేశ రాజధాని దిల్లీలో ప్రతి మిలియన్ జనాభాకు 18,596 నేరాలతో దేశంలో అత్యధిక నేరాల రేటును కలిగి ఉంది. సూరత్, కొచ్చిన్, అహ్మదాబాద్, చెన్నై(Chennai) నగరాలు అత్యధిక నేరాల రేటు గల నగరాల జాబితాలో ఉన్నాయి.
దక్షిణాది మెట్రో నగరాలతోపాటు హైదరాబాద్‌లో నేరాల రేటు తక్కువగా నమోదవుతోంది. బెంగళూరు(Bengaluru)లో ప్రతి మిలియన్ జనాభాకు 4,272 నేరాలతో సురక్షితమైన నగరాల్లో ఐదో స్థానంలో ఉంది. లక్ష జనాభాను పరిగణనలోకి తీసుకుంటే కోల్‌కతాలో 104.4, పూణేలో 256.8, హైదరాబాద్‌లో 259.9 నేరాలు నమోదయ్యాయి. బెంగళూరులో 427.2 నేరాలు మరియు ముంబయి(Mumbai)లో 428.4 నేరాలు ఉన్నాయి.
కోల్‌కతాలో 45, హైదరాబాద్‌లో 98, బెంగళూరులో 152, దిల్లీలో 454, ముంబైలో 162 హత్య కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నాలకు సంబంధించి కోల్‌కతాలో 135, హైదరాబాద్‌లో 192, బెంగళూరులో 371, దిల్లీలో 752, ముంబైలో 349 కేసులు నమోదయ్యాయి.
కోల్‌కతాలో 11, హైదరాబాద్‌లో 116, బెంగళూరులో 117, దిల్లీ(Delhi)లో 1,226, ముంబైలో 364 అత్యాచార కేసులు(Rape Cases) నమోదయ్యాయి. మహిళలపై దాడులకు సంబంధించి కోల్‌కతాలో 127, హైదరాబాద్‌లో 177, బెంగళూరులో 357, దిల్లీలో 1,023 కేసులు నమోదయ్యాయి.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్(TRS) ప్రభుత్వం శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. పోలీసు(Police)లకు ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. కొత్త పెట్రోలింగ్ వాహనాలతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించింది ప్రభుత్వం(Government). ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే.. శాంతిభద్రతలు క్షీణిస్తాయని అప్పట్లో చర్చ నడిచింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయితే.. మావోయిస్టులు తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేస్తారని కొంతమంది అన్నారు. అయితే ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం.. హైదరాబాద్ సేఫ్ ప్లేస్ గా ఉంది.