Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు డబ్బులు నిలిపేసిన కేంద్రం.. కారణం ఏంటంటే?-central govt withheld money to hyderabad metro for violation of guidelines ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Central Govt Withheld Money To Hyderabad Metro For Violation Of Guidelines

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు డబ్బులు నిలిపేసిన కేంద్రం.. కారణం ఏంటంటే?

HT Telugu Desk HT Telugu
Jul 24, 2022 03:38 PM IST

హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం డబ్బులను నిలిపివేసింది. దానికి సంబంధించి.. కారణాలు సైతం చెప్పింది. మొత్తం మంజూరైన రూ.1,458 కోట్లలో కొంత నిధులను నిలిపివేసింది.

హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ మెట్రో ఛార్జీలను సవరించినందున కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ డబ్బు నిలిపివేసింది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) మార్గదర్శకాలను హైదరాబాద్ మెట్రో ఉల్లంఘించిందని కేంద్రం చెబుతోంది. మొత్తం మంజూరైన రూ.1,458 కోట్లలో హైదరాబాద్ మెట్రోకు ఇప్పటి వరకు రూ.1,204 కోట్లు విడుదల చేసి రూ.254 కోట్లు నిలిపివేశారు. హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ స్టాండింగ్‌ కమిటీ జూలై 19న సమర్పించిన 'మెట్రో రైలు ప్రాజెక్టుల అమలు' నివేదికలో నిధులు వెల్లడించకపోవడానికి గల కారణాన్ని కేంద్రం వెల్లడించింది.

MGBS నుండి ఫలక్‌నుమా వరకు మెట్రో లైన్ పొడిగింపు పూర్తి కానందుకు లేదా హైదరాబాద్ మెట్రో చేపట్టిన ఛార్జీల సవరణ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని నిలిపివేసిందా అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ విషయం భారత ప్రభుత్వ పరిధిలోనిది అని హైదరాబాద్ మెట్రో రైలు MD NVS రెడ్డి చెబుతున్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖలో చర్చ జరుగుతుందన్నారు. దీనిపై వ్యాఖ్యానించలేనని స్పష్టం చేశారు.

ప్రాజెక్టు వాస్తవ వ్యయం రూ.18,411 కోట్లు. మొత్తంలో రూ.1204 కోట్లను భారత ప్రభుత్వం వీజీఎఫ్‌గా ఇస్తానంది. రూ. 17,207 కోట్లను ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్ అండ్ టీఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్) విడుదల చేసింది. మొత్తం వీజీఎఫ్ మంజూరు చేసిన గ్రాంట్‌లో రూ.254 కోట్లు నిలుపుదల చేసినట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. హైదరాబాద్ మెట్రో వీజీఎఫ్ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది.

హైదరాబాద్ మెట్రో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడ్‌లో నిర్మితమైంది. కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) పథకం ద్వారా PPP మోడల్ ఫండింగ్ కింద తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. VGF పథకం కింద, ఆర్థికంగా సమర్థనీయమైనా... కానీ ఆర్థికంగా లాభదాయకంగా లేని ప్రాజెక్ట్‌లకు గ్రాంట్ అందిస్తారు.

2020-2021 మధ్యకాలంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా హైదరాబాద్ మెట్రో ఆదాయం తగ్గిపోయింది. సగటు రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 19 లక్షల కంటే తక్కువగా ఉంది. 2020-2021లో హైదరాబాద్ మెట్రో రూ. 1,767 కోట్ల నష్టాన్ని చవిచూసిందని నివేదిక వెల్లడించింది. రూ.13,252 కోట్ల భారీ రుణం, 9.1 శాతం అధిక వడ్డీ భారం.., నష్టాలు పెరగడానికి ప్రధాన కారణాలు. సాధారణంగా, ప్రభుత్వ ప్రాజెక్టులకు 2 శాతం వడ్డీ రేటు మాత్రమే ఉంటుంది. ఏటా దాదాపు రూ.1200 కోట్ల వడ్డీ భారం పడుతోంది. రూ. 254 కోట్లను విడుదల చేయాలని హైదరాబాద్ మెట్రో.. ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.

IPL_Entry_Point