NCRB Report : అత్యాచార బాధితుల్లో 99 శాతం మందికి నేరస్తుల గురించి తెలుసు-ncrb report most rape victims in telangana knew their perpetrators ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Ncrb Report Most Rape Victims In Telangana Knew Their Perpetrators

NCRB Report : అత్యాచార బాధితుల్లో 99 శాతం మందికి నేరస్తుల గురించి తెలుసు

Anand Sai HT Telugu
Aug 29, 2022 02:37 PM IST

తెలంగాణలో అత్యాచార బాధితుల్లో దాదాపు 99.5 శాతం మందికి నేరస్తుల గురించి తెలుసు అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది. అంతేకాకుండా డేటా ప్రకారం 129 మంది (15.67 శాతం) రేపిస్టులు కుటుంబ సభ్యులు అని వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

తెలంగాణలో క్రైమ్ పెరుగుతోంది. హత్యలు, అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్ లో ఈ పరిస్థితి ఇంకా ఎక్కువగా ఉంది. అయితే తెలంగాణలో నమోదైన 823 అత్యాచార కేసుల్లో 819 మంది బాధితులకు నిందితులు తెలుసు. 509 (61.8%) కేసుల్లో నిందితులు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా, అంతేకాకుండా స్నేహితులు భాగస్వాములుగా ఉన్నారు. కేవలం నాలుగు కేసుల్లో నిందితులకు బాధితులెవరో తెలియదని నివేదిక పేర్కొంది.

దక్షిణ భారత రాష్ట్రాల గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ (99.6 శాతం), కర్ణాటక (98.2), కేరళ (99.6), తమిళనాడు (98.3) బాధితులకు నిందితులు తెలుసు. అన్ని విభాగాల్లో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉంది.

దేశవ్యాప్తంగా గణాంకాలు చూసుకుంటే.. నమోదైన మొత్తం కేసులు 31,677గా ఉన్నాయి. బాధితులకు తెలిసిన నిందితులు 30,571గా ఉన్నారు. కుటుంబం నుంచి 2,424 మంది ఉన్నారు. స్నేహితులు/భాగస్వామ్యాల్లో నివసిస్తున్నారు/విడిపోయిన భర్తలు 12,951గా ఉన్నారు. కుటుంబ స్నేహితులు/ పొరుగువారు/యజమానులు 15,196 మంది ఈ నిందితుల్లో ఉన్నారు. బాధితులకు తెలియని వారి సంఖ్య 1,106గా ఉంది.

మరోవైపు 2021లో తెలంగాణలో నేరాల సంఖ్య 1.45 లక్షల కేసులు. 2020లో 1.35 లక్షల కేసులు నమోదయ్యాయి. దాదాపు 10,000 కేసులు ఎక్కువగా పెరిగాయి. తెలంగాణ పోలీసులు 80 శాతం కేసుల్లో సరైన విచారణ చేసి కోర్టుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. కేసుల దర్యాప్తులో 95 శాతంతో గుజరాత్‌ అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ (91.9 శాతం), కేరళ (91.8) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌కు సంబంధించి మొత్తం 17,951 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 4,365 మంది మహిళలపై దాడులు జరిగాయి. దాదాపు 620 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 221 మంది బాధితులను రక్షించారు. మొత్తం 123 మానవ అక్రమ రవాణా కేసులను నమోదు చేశారు. 2021లో తెలంగాణలో దాదాపు 823 రేప్ కేసులు నమోదయ్యాయి. 562 అల్లర్లకు సంబంధించిన కేసులు ఉన్నాయి. వాటిలో 712 మంది బాధితులను గుర్తించారు. 2021లో రాష్ట్రంలో సుమారు 7971 దొంగతనాలు నమోదయ్యాయి.

IPL_Entry_Point