SCR Special Trains: విశాఖ, సికింద్రాబాద్, మహబూబ్​నగర్​కు ప్రత్యేక రైళ్లు-scr announced weekly special trains to visakha secunderabad mahbubnagar full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains: విశాఖ, సికింద్రాబాద్, మహబూబ్​నగర్​కు ప్రత్యేక రైళ్లు

SCR Special Trains: విశాఖ, సికింద్రాబాద్, మహబూబ్​నగర్​కు ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu
Sep 29, 2022 09:53 AM IST

south central railway special trains: దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. విశాఖ, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ నగరాలకు వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఈ మేరకు వివరాలను ప్రకటించింది.

<p>దక్షిణ మధ్య రైల్వే, ప్రత్యేక రైళ్లు&nbsp;</p>
దక్షిణ మధ్య రైల్వే, ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... దసరా పండగ నేపథ్యంలో తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. వాటిని చూస్తే.....

విశాఖ - సికింద్రాబాద్

Visakhapatnam – Secunderabad: విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్‌ 5 నుంచి 26 వరకు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకు (బుధవారం) ప్రత్యేక రైలు (08579) నడపనున్నారు. ఇక అక్టోబర్‌ 6 నుంచి 27 వరకు సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు (గురువారం) ప్రత్యేక రైలు (08580) సేవలు ఉంటాయని ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ ట్రైన్ దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామల్ కోట్, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూురు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.

<p>వీక్లీ ట్రైన్స్ వివరాల పట్టిక&nbsp;</p>
వీక్లీ ట్రైన్స్ వివరాల పట్టిక&nbsp; (scr.indianrailways.gov.in)

విశాఖ - మహబూబ్ నగర్

Visakhapatnam –Mahbubnagar special trains: అక్టోబర్‌ 4 నుంచి 25 వరకు విశాఖపట్నం నుంచి మహబూబ్‌నగర్‌ వరకు (మంగళవారం) ప్రత్యేక రైలు (08585) వీక్లీ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఇక అక్టోబర్‌ 5 నుంచి 26 వరకు మహబూబ్‌నగర్‌ నుంచి విశాఖ వరకు(బుధవారం) ప్రత్యేక రైలు (08586)ను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.

ఆగే స్టేషన్లు ఇవే....

ఈ ప్రత్యేక రైలు... దువ్వాడ, సామల్ కోట్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజ్ గిరి, కాచిగూడ, ఉమద్ నగర్, షాద్ నగర్, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతుంది.

మరోవైపు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 9 వరకు రైల్వే ప్లాట్ ఫాం ధరలు పెంచుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. దసరా పండగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల బంధువులు కూడా ఎక్కువ వస్తుంటారు. రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచుతున్నట్టుగా ప్రకటించింది. ఈ ధరలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు అమలు కానున్నాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. . కాచిగూడ రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ. 20కి పెంచారు.

Whats_app_banner