తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains: దసరా స్పెషల్… ఈ నగరాల మధ్య 12 ప్రత్యేక రైళ్లు

SCR Special Trains: దసరా స్పెషల్… ఈ నగరాల మధ్య 12 ప్రత్యేక రైళ్లు

HT Telugu Desk HT Telugu

30 September 2022, 14:04 IST

    • south central railway special trains: దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు వివరాలను ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే

దక్షిణ మధ్య రైల్వే

South Central Railway Special Trains Latest: మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... దసరా పండగ నేపథ్యంలో తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. వాటిని చూస్తే.....

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Rains : హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ జామ్, విద్యుత్ కు అంతరాయం- సహాయ చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Mlc Kavitha : ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారు, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు- ఎమ్మెల్సీ కవిత

Karimnagar : కరీంనగర్ లో గాలి వాన బీభత్సం, సీఎం రేవంత్ రెడ్డి టూర్ రద్దు

Khammam Accident : ఖమ్మంలో విషాదం- రేపు బర్త్ డే, రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

సంత్రగాచి-సికింద్రాబాద్ మధ్య అక్టోబర్ 1న స్పెషల్ ట్రైన్(Train No.07646: ) ను నడపనుంది. ఈ ట్రైన్ సాయంత్రం 6.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు రాత్రి 09.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక టైన్ నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖటప్నం, విజయనగరం, భువనేశ్వర్, ఖరగ్ పూర్ స్టేషన్లలో ఆగుతుంది.

సికింద్రాబాద్-షాలిమార్ మధ్య అక్టోబర్ 2న స్పెషల్ ట్రైన్( Train No.07741)ను నడపనున్నారు. ఈ ట్రైన్ 04.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 06.05 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

ఈ ట్రైన్ కాజీపేట, వరంగల్, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, పలాసా, సోంపేట, బెర్హంపూర్, భువనేశ్వర్, భద్రక్, ఖరగ్ పూర్, సంత్రగాచి స్టేషన్లలో ఆగుతుంది.

షాలిమార్-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్( Train No.07742)ను అక్టోబర్ 3న నడపనున్నారు. ఈ ట్రైన్ 14.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 16.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

నాందేడ్-బెర్హంపూర్ ట్రైన్( Train No.07431) ను అక్టోబర్ 1, 8 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ 15.25 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 14.30కి గమ్యానికి చేరుకుంటుంది. బెర్హంపూర్-నాందేడ్ ట్రైన్( Train No.07432) ను అక్టోబర్ 2, 9 తేదీల్లో ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 16.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 15.45 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్స్ ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, మేడ్చల్, సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాసా స్టేషన్లలో ఆగుతుంది.

త్రివేండ్రమ్-టాటానగర్ ట్రైన్( Train No.06192) ను అక్టోబర్ 1, 8 తేదీల్లో ప్రకటించారు. ఈ ట్రైన్ ఆయా రోజుల్లో (శనివారం) 02.30 గంటలకు బయలుదేరి.. సోమవారం 04.20 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. టాటానగర్-త్రివేండ్రం ట్రైన్( Train No.06191)ను అక్టోబర్ 4, 11 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ 05.15 (మంగళవారం) బయలుదేరి.. గురువారం 05.50 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.

ఈ ట్రైన్లు కొల్లాం, ఎర్నాకులం, ఆలువా, సేలం, గూడురు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం తదితర స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.