తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc : ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు తప్పవు.. సజ్జనార్ వార్నింగ్

TGSRTC : ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే చ‌ర్య‌లు తప్పవు.. సజ్జనార్ వార్నింగ్

21 September 2024, 15:15 IST

google News
    • TGSRTC : తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తప్పవని.. ఆ సంస్థ ఎండీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ శాఖ స‌హ‌కారంతో నిందితుల‌పై రౌడీషీట్స్ ఓపెన్ చేస్తామని స్పష్టం చేశారు. దాడికి గురైన ఆర్టీసీ డ్రైవ‌ర్‌ను పరామర్శించిన ఎండీ వీసీ సజ్జనార్.. ఈ వ్యాఖ్యలు చేశారు.
గాయపడిన డ్రైవర్‌ను పరామర్శిస్తున్న సజ్జనార్
గాయపడిన డ్రైవర్‌ను పరామర్శిస్తున్న సజ్జనార్ (@tgsrtcmdoffice)

గాయపడిన డ్రైవర్‌ను పరామర్శిస్తున్న సజ్జనార్

త‌మ సిబ్బందిపై దాడుల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని.. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ార్ హెచ్చ‌రించారు. పోలీస్ శాఖ స‌హ‌కారంతో నిందితుల‌పై రౌడీ షీట్స్ తెరుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. దుండగుల చేతిలో దాడికి గురై తార్నాక ఆర్టీసీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న.. కుషాయిగూడ డిపో డ్రైవ‌ర్ దార‌వ‌త్ గ‌ణేష్‌ను స‌జ్జ‌నార్ ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.

గాయపడ్డ డ్రైవర్‌కు టీజీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని.. సజ్జనార్ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. డ్రైవ‌ర్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అప్జ‌ల్ గంజ్ నుంచి ఘ‌ట్‌కేస‌ర్‌కు వెళ్తున్న రూట్ నంబ‌ర్ 231/1 మెట్రో ఎక్స్ ప్రెస్ బ‌స్సులో.. విధులు నిర్వ‌ర్తిస్తోన్న డ్రైవ‌ర్ గ‌ణేష్‌పై దుండ‌గులు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా దాడి చేశారు.

ఎలాంటి తప్పు లేకున్నా తనపై దాడి చేశారని గణేష్ వివరించారు. బస్సును రోడ్డుపై ఆపి సీటులో కూర్చున్న డ్రైవర్‌ను అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. డ్రైవర్ గ‌ణేష్‌కు తీవ్ర గాయ‌ల‌వ‌డంతో అప‌స్మార‌క స్థిత‌లోకి వెళ్లిపోయారు. వెంట‌నే ఆయ‌న‌ను తార్నాకలోని ఆర్టీసీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఉస్మానియా యూనివ‌ర్శిటీ వై.జంక్ష‌న్ వ‌ద్ద శుక్ర‌వారం ఈ ఘటన జ‌రిగింది.

ఈ ఘటనలో తమ డ్రైవ‌ర్‌ది ఎలాంటి తప్పులేదని, బైక్‌ల‌పై వ‌చ్చి ఉద్దేశపూర్వకంగా దుండగులు దాడికి పాల్పడ్డారని వీసీ సజ్జనార్ వివరించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ ఉస్మానియా యూనివ‌ర్శిటీ పోలీసులు స్పందించార‌ని చెప్పారు. దుండ‌గుల‌పై బీఎన్ఎస్‌లోని 109, 132, 352, 351(2), r/w 3(5) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశార‌న్నారు. ఐదుగురు దుండ‌గుల‌ను శ‌నివారం అరెస్ట్ చేశారని వివరించారు.

ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీజీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేయ‌డం బాధాక‌ర‌మ‌ని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

తదుపరి వ్యాసం