తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ‍Neelam Madhu: మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరనున్న పటాన్‌చెరు నీలం మధు… ఆసక్తికరంగా మారిన మెదక్ రాజకీయాలు

‍Neelam Madhu: మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరనున్న పటాన్‌చెరు నీలం మధు… ఆసక్తికరంగా మారిన మెదక్ రాజకీయాలు

HT Telugu Desk HT Telugu

13 February 2024, 13:19 IST

google News
    • Neelam Madhu: దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, రాజకీయ పార్టీలు తమ గెలుపు అవకాశాలు పెంచుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.  మెదక్‌ స్థానాన్ని దక్కించుకునే ప్రయత్నాల్లో నీలం మధును మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. 
మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోకి నీలం మధు
మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోకి నీలం మధు

మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోకి నీలం మధు

Neelam Madhu: బీఆర్ఎస్ పార్టీ కి కంచుకోట అయినా మెదక్ లోక్ సభ స్థానంలో తమ గెలుపు అవకాశాలను మెరుగు పరుచుకోవడానికి కూడా తెలంగాణ లో అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నది.

మెదక్ లోక్ సభ పరిధిలోని పఠాన్ చెరువు నియోజకవర్గాన్ని ఏడూ వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీకి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ, రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ప్రత్యర్థి పైన ఇక్కడ పై చేయి సాధించాలని ఎత్తులు వేస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పఠాన్ చెరువు నియోజకవర్గం నుండి పోటీ చేసి సుమారుగా 46 వేల ఓట్లు తెచ్చుకున్న నీలం మధు ని కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించింది.

తన రాజకీయ భవిషత్తు దృష్ఠ, తాను కూడా బీఎస్పీ పార్టీ ని వీడి, కాంగ్రెస్ లో చేరాలని నీలం మధు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇట్టి విషయం తన అనుచరులతో నీలం మధు మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం.

కాటా శ్రీనివాస్ గౌడ్ ఎలా తీసుకుంటారనేది ఆసక్తికరం…

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు చేరికను ఏ విధంగా తీసుకుంటారని అనేది అందరు ఎదురు చూస్తున్నారు.

గత ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీ లో ఉన్న నీలం మధు, కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. కాంగ్రెస్ పార్టీ మధుకు పఠాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గం సీటుని కూడా ప్రకటించింది.

తన చేరిక, టికెట్ ప్రకటన సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. తనకు టికెట్ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ, పార్టీ లో అప్పడికే ఉండి టికెట్ ఆశిస్తున్నా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. ధర్నాలు, రాస్తా రోకోలతో, పఠాన్ చెరువు అట్టుడికి పోయింది.

ఇద్దరి మధ్య విబేధాలతో కాంగ్రెస్ ఓటమి ...

జిల్లాలో సీనియర్ నాయకుడు, ఇప్పటి ఆరోగ్యశాఖ ఆమాత్యులు దామోదర రాజనరసింహ కాటా శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా నిలవగా, మరొక సీనియర్ నాయకుడు జగ్గా రెడ్డి మధుకు అండగా నిలిచాడు. ఈ పరిణామాల మధ్య, కాంగ్రెస్ నాయకత్వం మల్లి టికెట్ కాటా శ్రీనివాస్ గౌడ్ కి వచ్చింది.

ఎలాగైనా ఎన్నికల్లో పోటీలో నిలవాలి అనే సంకల్పంతో, మధు బీఎస్పీ నుండి ఎన్నికల బరిలో దిగాడు. కాటా శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి చేతిలో 7 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు మద్యల విబేధాలు కాంగ్రెస్ ఓటమికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో, నీలం మధు మల్లి కాంగ్రెస్ పార్టీ లో చేరటం ఎలా దారి తీస్తుందోనని, అన్ని వర్గాల రాజకీయ నాయకులూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్)

తదుపరి వ్యాసం