తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nfbs - National Family Benefit Scheme: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్‌ వివరాలు

NFBS - national family benefit scheme: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్‌ వివరాలు

24 August 2022, 11:07 IST

google News
    • NFBS - national family benefit scheme: కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబానికి ఒకింత సాయంగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) 1995లో ప్రారంభించింది. ఈ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
కుటుంబం (ప్రతీకాత్మక చిత్రం)
కుటుంబం (ప్రతీకాత్మక చిత్రం) (unsplash)

కుటుంబం (ప్రతీకాత్మక చిత్రం)

NFBS - national family benefit scheme: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (ఎన్‌ఎఫ్బీఎస్) పథకాన్ని 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల వారై ఉండి కుటుంబాన్ని పోషిస్తున్న వారు అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు గానీ, సహజంగా గానీ, అనారోగ్య రీత్యా గానీ, ఏ కారణం చేతనైనా మరణిస్తే రూ. 20 వేలు సాయం చేసేందుకు అమలు చేస్తున్నారు.

అయితే‌ ఈ సాయాన్ని 2013లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేలకు కుదించగా, తెలంగాణ ప్రభుత్వం 2017లో తిరిగి రూ. 20 వేలకు పెంచింది.

NFBS - national family benefit scheme: పెరిగిన సాయం

ఆమ్ ఆద్మీ బమా యోజన, ఆపద్బంధు పథకాలకు మాత్రమే దరఖాస్తులు వస్తున్నాయని, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్‌కు దరఖాస్తులు రావడం లేదని గ్రహించిన ప్రభుత్వం తిరిగి ఈ సాయాన్ని పెంచింది. ఈ మేరకు 2017 ఏప్రిల్ 12న జీవో 25 విడుదల చేసింది.

గృహిణి(హోమ్ మేకర్)గా ఉన్న మహిళ కూడా మరణిస్తే ఈ పథకం ద్వారా సంబంధిత కుటుంబం సాయం పొందవచ్చు.

పంచాయతీ సెక్రటరీ ద్వారా, స్థానిక మున్సిపల్ అధికారుల ద్వారా గానీ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఈ పథకానికి కేంద్రం రాష్ట్రాలకు నిధులు అందిస్తోంది.

తదుపరి వ్యాసం