తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Samagra Kutumba Survey : సమగ్ర కుటుంబ సర్వేలో ములుగు టాప్.. లాస్ట్‌లో హైదరాబాద్.. 6 ముఖ్యాంశాలు

TG Samagra Kutumba Survey : సమగ్ర కుటుంబ సర్వేలో ములుగు టాప్.. లాస్ట్‌లో హైదరాబాద్.. 6 ముఖ్యాంశాలు

18 November 2024, 9:29 IST

google News
    • TG Samagra Kutumba Survey : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే.. విజయవంతంగా సాగుతోంది. ఈ సర్వేలో ములుగు జిల్లా టాప్‌లో ఉండగా.. హైదరాబాద్ లాస్ట్‌లో ఉంది. ఇప్పటివరకు 58 శాతం ఇంటింటి సర్వే పూర్తయ్యింది. దీనికి సంబంధించి 6 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
సమగ్ర కుటుంబ సర్వే
సమగ్ర కుటుంబ సర్వే

సమగ్ర కుటుంబ సర్వే

అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే.. విజయవంతంగా సాగుతోంది. నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3 శాతం పూర్తయింది.

సర్వేలో ముందుగా నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇళ్ల గణనను చేపట్టారు. రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించారు. నవంబర్ 9వ తేదీ నుంచి ఇంటింటి వివరాల సర్వే ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 67, 72, 246 ఇళ్ల సర్వే పూర్తయింది.

1.జిల్లాల వారీగా సర్వే పురోగతిలో ములుగు (87.1% ), నల్గొండ (81.4%) జిల్లాలు ముందంజలో ఉన్నాయి. ఆ తర్వాత జనగాం (77.6%), మంచిర్యాలు (74.8%), పెద్దపల్లి (74.3%) ఉన్నాయి.

2.జన సాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్​ హైదరాబాద్​‌ పరిధిలో 38.3 శాతం సర్వే పూర్తయింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 58 శాతం ఇంటింటి సర్వే పూర్తయింది.

3.నవంబర్ 17 నాటికి సర్వే పూర్తయిన ఇండ్లు:

గ్రామీణం: 64,41,183

పట్టణం: 51,73,166

మొత్తం: 1,16,14,349

4.బ్లాకులు:

గ్రామీణం: 52,493

పట్టణం: 40,408

మొత్తం: 92,901

5.ఎన్యుమరేటర్లు:

గ్రామీణం: 47,561

మొత్తం: 87,807

6.పర్యవేక్షకులు:

గ్రామీణం: 4,947

పట్టణం: 3,841

మొత్తం: 8,788

తదుపరి వ్యాసం