తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hero Nagarjuna : సినీ ప్రముఖల జీవితాలు రాజకీయాలకు వాడుకోవద్దు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున ట్వీట్

Hero Nagarjuna : సినీ ప్రముఖల జీవితాలు రాజకీయాలకు వాడుకోవద్దు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున ట్వీట్

02 October 2024, 18:35 IST

google News
    • Hero Nagarjuna On Konda Surekha : మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేస్తూ...సమంత-నాగ చైతన్య విడాకులకు ఆయన కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై హీరో నాగార్జున స్పందించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండని హితవు పలికారు.
మా కుటుంబం పట్ల మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున ట్వీట్
మా కుటుంబం పట్ల మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున ట్వీట్

మా కుటుంబం పట్ల మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున ట్వీట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత-నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అని ఆరోపించారు. కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై హీరో నాగార్జున స్పందించారు.

"మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను" - అని హీరో నాగార్జున ట్వీట్ చేశారు.

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా?" అంటూ ట్వీట్ చేశారు. 

మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే?

నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె… చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని విడిపోవడానికి కూడా కేటీఆర్ కారణమని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మూడు సోషల్ మీడియా అకౌంట్లు దుబాయ్ నుంచి ఆపరేషన్స్ జరుగుతున్నాయని అన్నారు. తనపై అసభ్యకరమైన పోస్టులు పోస్టులు పెడితే కనీసం ఖండించకుండా... ఇష్టానుసారంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న కేటీఆర్… పోస్టులు పెట్టిన వారిని పార్టీ నుంచి బహిష్కరించకుండా... వెనకేసుకొచ్చేలా మాట్లాడతున్నారని అన్నారు. పోస్టుల వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

"కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు. డ్రగ్స్ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాడు. నాగచైతన్య - సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్. చాలా మంది హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లడానికి కూడా కారణం కేటీఆర్. ఈ విషయం అందరికీ తెలుసు" అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. 

బీఆర్ఎస్ కౌంటర్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చౌకబారుగా, జుగుప్సాకరంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. రాహుల్ గాంధీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ పార్టీ నాయకుడు ఇలా మాట్లాడుతున్నారని ట్వీట్ చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయాలకు అవమానం అని పేర్కొంది. రాజ్యాంగం గురించి, దాని విలువల గురించి బోధించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని విమర్శించింది.

కొండా సురేఖ మాటలకు అందరూ అసహ్యించుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. ఖబడ్ధార్.. నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతా అంటే ఊరుకునేది లేదన్నారు.  కాంగ్రెస్ పాలన వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే మహిళా మంత్రులను పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

తదుపరి వ్యాసం