తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Hundi : మా ఆయన బెట్టింగ్ మానేయాలి-మేడారం తల్లులకు భక్తురాలి మొర

Medaram Hundi : మా ఆయన బెట్టింగ్ మానేయాలి-మేడారం తల్లులకు భక్తురాలి మొర

04 March 2024, 15:49 IST

    • Medaram Hundi : మేడారం సమ్మక్క సారలమ్మ హుండీ కానులను నాలుగు రోజుల పాటు లెక్కించారు. ఇప్పటి వరకూ రూ.10.32 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. అయితే హుండీల్లో భక్తుల కోర్కెల చిట్టీలు కూడా ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని చూసి సిబ్బంది అవాక్కయ్యారు.
మా ఆయన బెట్టింగ్ మానేయాలి-భక్తురాలి మొర
మా ఆయన బెట్టింగ్ మానేయాలి-భక్తురాలి మొర

మా ఆయన బెట్టింగ్ మానేయాలి-భక్తురాలి మొర

Medaram Hundi : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర (Medaram Jatara)ఎంతో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ నాలుగు రోజుల పాటు జరిగిన ఈ జాతరకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు. దాదాపు కోటి 40 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. జాతర ముగియడంతో...హుండీ ఆదాయం (Medaram Hundi Counting)లెక్కింపు మొదలైంది. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో పోలీసుల పర్యవేక్షణలో... ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులు సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించారు.

ట్రెండింగ్ వార్తలు

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

TS EAPCET 2024 Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్ - ఈ డైరెక్ట్ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

18 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

హుండీ ఆదాయం

హనుమకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో నాలుగు రోజుల పాటు మేడారం సమ్మక్క, సారలమ్మ (Sammakka Saralamma)హుండీల ఆదాయం లెక్కించారు. మొత్తం 317 హుండీలను లెక్కించగా రూ.9.60 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం నాలుగో రోజు లెక్కింపులో... 88 ఐరన్‌ హుండీలు విప్పి కానుకలు లెక్కించారు. ఈ హుండీల్లో రూ.71.67 లక్షల ఆదాయం లభించింది. నాలుగో రోజు లెక్కింపుతో కలిపి మొత్తం 405 హుండీల్లో రూ.10,32,03,000 ఆదాయం(Medaram Hundi Counting) వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేశామని మేడారం ఈవో రాజేంద్రం వెల్లడించారు.

మా ఆయన బెట్టింగ్ మానేయాలి

రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర ఈ ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అయితే మొక్కులు చెల్లించుకున్న భక్తులు...హుండీలలో కానుకలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల్లో(Medaram Hundi) భక్తులు కాగితాలపై తమ కోర్కెలు రాసిన వేసిన ఘటనలు వెలుగుచూశారు. ఓ భక్తురాలు.. 'మా ఆయన బెట్టింగ్‌ మానేయాలి. మా అక్క కొడుక్కి ఐఐటీలో సీట్‌ రావాలి' అని రాసిన పేపర్‌ హుండీలో లభించింది. ఇటీవల బెట్టింగ్ రక్కసి కుటుంబాలను ఛిద్రం చేస్తుంది. దీంతో ఆ మహమ్మారి అంతమొందించాలని సమ్మక్క-సారలమ్మకు మొరపెట్టుకుందో భక్తురాలు. తన భర్తను బెట్టింగ్ మాయ నుంచి బయపడేలాని తల్లులను కోరుకుంది. బెట్టింగ్ యాప్ లో మాయలో పడి ఇల్లు గుల్ల చేసి, చివరకి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఇటీవల తెలంగాణలో తరచూ చోటుచేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ లను కట్టడి చేయాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాయి.

నకిలీ నోట్లు

మేడారం మహాజాతర హుండీల(Medaram Hundi Counting 2024) లెక్కింపులో విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. హుండీల్లో విదేశీ కరెన్సీతో పాటు నకిలీ నోట్లు దర్శనం ఇస్తున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ ఫొటోకు బదులు రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్​.అంబేడ్కర్​ ఫొటో ఉన్న రూ.100 నోట్లను హుండీల్లో వేశారు. దీంతో హుండీ లెక్కిస్తున్న సిబ్బంది వాటిని చూసి అవాక్కయ్యారు. వెంటనే అక్కడున్న దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నకిలీ నోట్లను హుండీల్లో వేసిన పలువురు భక్తులు కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేస్తూ వెనక వైపు ప్రింట్​ కూడా చేయించారు. దీంతో అధికారులు వాటిని సేకరించి భద్రపరిచారు.

తదుపరి వ్యాసం