తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Upsc Civils 2023 Results : సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు, దోనూరు అనన్య రెడ్డికి మూడో ర్యాంక్

UPSC Civils 2023 Results : సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు, దోనూరు అనన్య రెడ్డికి మూడో ర్యాంక్

17 April 2024, 8:39 IST

google News
    • UPSC Civils 2023 Results : యూపీఎస్సీ సివిల్స్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో 50 మంది అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు.
 సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు
సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

UPSC Civils 2023 Results : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 తుది ఫలితాలు(UPSC Civils 2023 Results) విడుదల అయ్యాయి. సివిల్స్ ఫైనల్ రిజల్ట్స్ లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. సివిల్స్-2023 ఫలితాల్లో తెలంగాణకు చెందిన దోనూరు అనన్య రెడ్డి ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్య తన ఫస్ట్ అటెంప్ట్ లోనే మూడో ర్యాంకు(UPSC AIR 3rd Rank) సాధించారు. ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు రావడంపై అనన్య రెడ్డి (Donuru Ananya Reddy)సంతోషం వ్యక్తం చేశారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నానన్నారు. ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని, రోజులు 12-14 గంటలు చదివేదానినని ఆమె తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల‌కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందనలు తెలిపారు. తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్ కు ఎంపికవటం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరు అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

తుది ఫలితాల్లో 1016 మంది ఎంపిక

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 తుది ఫలితాల్లో(UPSC Civils Results) 1,016 మందిని ఎంపిక చేశారు. 180 మంది ఐఏఎస్ (IAS)కు, 37 మంది ఐఎఫ్ఎస్(IFS) కు, 200 మంది ఐపీఎస్ (IPS)కు ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ కేటగిరిలో 613 మంది, గ్రూప్-బి సర్వీసెస్ లో 113 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. సివిల్స్ సర్వీసెస్-2023 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 50 అభ్యర్థులు ర్యాంకులు సాధించారు.

సివిల్స్ -2023 ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు(Telugu States Civil Services Rankers)

  • దోనూరు అనన్య రెడ్డి-3వ ర్యాంకు
  • నందల సాయి కిరణ్- 27వ ర్యాంకు
  • మేరుగు కౌశిక్- 82వ ర్యాంకు
  • ధీరజ్ రెడ్డి- 173వ ర్యాంకు
  • అక్షయ్ దీపక్-196వ ర్యాంకు
  • గణేశ్న భానుశ్రీ లక్షీ అన్నపూర్ణ- 198వ ర్యాంకు
  • నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి-382వ ర్యాంకు
  • బన్న వెంకటేశ్-467వ ర్యాంకు
  • కడుమూరి హరిప్రసాద్ రాజు-475వ ర్యాంకు
  • పూల ధనుష్-480వ ర్యాంకు
  • కె.శ్రీనివాసులు-526వ ర్యాంకు
  • నెల్లూరు సాయితేజ -558వ ర్యాంకు
  • కిరణ్ సాయింపు-568వ ర్యాంకు
  • మర్రిపాటి నాగ భరత్-580వ ర్యాంకు
  • పోతుపురెడ్డి భార్గవ్ - 590వ ర్యాంకు
  • కె. అర్పిత-639వ ర్యాంకు
  • ఐశ్యర్య నెల్లిశ్యామల-649వ ర్యాంకు
  • సాక్షి కుమారి-679వ ర్యాంకు
  • చౌహాన్ రాజ్ కుమార్-703వ ర్యాంకు
  • గాదె శ్వేత-711వ ర్యాంకు
  • వి.ధనుంజయ్ కుమార్ -810వ ర్యాంకు
  • లక్ష్మీ బానోతు- 828వ ర్యాంకు
  • ఆదా సందీప్ కుమార్-830వ ర్యాంకు
  • జె. రాహుల్ -873వ ర్యాంకు
  • వేములపాటి హనిత-887వ ర్యాంకు
  • కె. శశికాంత్ -891వ ర్యాంకు
  • కెసారపు మీనా- 899వ ర్యాంకు
  • రావూరి సాయి అలేఖ్య -938వ ర్యాంకు
  • గోవద నవ్యశ్రీ -995వ ర్యాంకు

తదుపరి వ్యాసం