తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Challans | పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్స్.. ట్రాఫిక్ పోలీసుల బంపర్ ఆఫర్!

Challans | పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్స్.. ట్రాఫిక్ పోలీసుల బంపర్ ఆఫర్!

HT Telugu Desk HT Telugu

23 February 2022, 19:35 IST

google News
    • చలాన్‌లు పెండింగ్‌లో ఉన్న వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. వారి వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు సులభంగా చెల్లించేందు కోసం భారీ డిస్కౌంట్లను ప్రకటించారు.
Hyderabad Traffic Police
Hyderabad Traffic Police (Stock Photo)

Hyderabad Traffic Police

Hyderabad | వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి చలాన్‌లు పెండింగ్‌లో ఉన్న వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. వారి వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు సులభంగా చెల్లించేందు కోసం భారీ డిస్కౌంట్లను ప్రకటించారు.

COVID-19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున మానవతా దృక్పథంతో ఈ వన్-టైమ్ డిస్కౌంట్ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసు విభాగం బుధవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నవారిలో దాదాపు 85 శాతం దిచక్ర వాహనాలు, ఆటోలు నడిపే సామాన్య, మధ్యతరగతి ప్రజలే ఉన్నారని ప్రకటనలో వెల్లడించారు.

ప్రతిపాదించిన రాయితీలు ఈ రకంగా ఉన్నాయి:

ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 25% చలాన్‌ చెల్లిస్తే మిగిలిన 75% పెండింగ్‌ చలాన్‌లు మాఫీ అవుతాయి. తోపుడు బండ్లు, ఇతర కార్ట్ వాహనాలను ఉపయోగించే చిరు వ్యాపారులు 20% చెల్లిస్తే, మిగిలిన 80% మాఫీ అవుతుంది.

ఇదే క్రమంలో తేలికపాటి మోటారు వాహనాలు (LMVలు), కార్లు, జీపులు, అలాగే భారీ వాహనాలకైతే మొత్తం చలాన్లలో సగం చెల్లించాలి, మిగతా సగం మాఫీ. ఇక చివరగా, ఆర్టీసీ డ్రైవర్లు 30% చెల్లిస్తే, మిగిలిన 70% మాఫీ అవుతుంది.

ఈ చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లో లేదా మీసేవా మాత్రమే చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సదుపాయం మార్చి 1 నుంచి మార్చి 31 మధ్య ఉపయోగించుకోవచ్చునని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలు ఇంకా ఆమోదం పొందలేదు. సెలవులో ఉన్న డీజీపీ మహేంధర్ రెడ్డి తిరిగి రాగానే ఆయన ఆమోదం పొందిన తర్వాత ఈ డిస్కౌంట్స్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు దాదాపుగా రూ. 600 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం.

తదుపరి వ్యాసం