అర్ధరాత్రి కర్మన్ ఘాట్ వద్ద ఉద్రిక్తత.. ఏడుగురి అరెస్టు
23 February 2022, 16:28 IST
- హైదరాబాద్‌లోని కర్మాన్ ఘాట్ లో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గోవులను తరలిస్తున్న ముఠాను గో రక్షక్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై దాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి చేసిన వారిలో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
కర్మాన్ ఘాట్ ఉద్రిక్తతలో ఏడుగురు అరెస్టు
కర్మాన్ ఘాట్ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోవులను తరలిస్తున్న వారిని.. గో రక్షక్ సభ్యులు అడ్డుకోగా.. వారిపై కొంతమంది దాడి చేశారు. ఈ కారణంగా గో రక్షక్ సభ్యులు ఆందోళన చేశారు. కర్మాన్ ఘాట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. అయితే తమపై దాడి చేసిన వారని అరెస్టు చేయాలని గో రక్షక్ సభ్యులు డిమాండ్ చేశారు. ఉద్రిక్తతకు కారణమైన ఏడుగురిని మీర్‌పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏం జరిగిందంటే..?
భవానీనగర్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్, మహ్మద్ నిసార్, మహ్మద్ నవాజ్, మరో నలుగురు.. బోలేరో వాహనంలో అర్ధరాత్రి.. గోవులను తరపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గో రక్షక్ దళ సభ్యులు గమనించారు. గాయత్రీనగర్ వద్ద.. వాహనాన్ని అడ్డుకుని ఆపాలని కోరారు. గోవులను తీసుకెళ్తున్న వాళ్లు.. ఆపకుండా.. వెళ్లిపోయారు. దీంతో గో రక్షక్ సభ్యులు.. వాహనాన్ని వెంబడించారు. అయితే గోవులను తరలిస్తున్న వ్యక్తులు.. గో రక్షక్ సభ్యులపై దాడికి దిగారు.
ఈ కారణంగా కర్మాన్ ఘాట్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ.. గో రక్షక్ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఇక వారిని అదుపులోకి తీసుకుని.. గోవులను గోశాలకు తరలించడంతో కర్మాన్ ఘాట్ లో పరిస్థితులు శాంతించాయి. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోనున్నట్టు ఏసీపీ శ్రీధర్ రెడ్డి చెప్పారు. సంయమనం పాటించి.. శాంతంగా పరిక్షించుకోవాలని సూచించారు. కర్మాన్ ఘాట్ లో ఉద్రిక్త పరిస్థితుల విషయం తెలిసి.. ఘటనాస్థలానికి.. సీపీ మహేష్ భగవత్ చేరుకొని శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. చూసుకోవాలని ఆదేశించారు.