TS IPS Transfers : తెలంగాణలో 12 మంది ఐపీఎస్ లు బదిలీ, రాచకొండ సీపీగా తరుణ్ జోషి నియామకం
12 February 2024, 21:20 IST
- TS IPS Transfers : తెలంగాణలో 12 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాచకొండ సీపీగా తరుణ్ జోషి,సీఐడీ డీఐజీగా నారాయణ్ నాయక్ నియమితులయ్యారు.
తెలంగాణలో 12 మంది ఐపీఎస్ లు బదిలీ
TS IPS Transfers : తెలంగాణలో 12 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మల్టీజోన్-2 ఐజీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోకి రాచకొండ సీపీగా తరుణ్ జోషి నియమితులయ్యారు. రామగుండం కమిషనర్‌గా శ్రీనివాసులు, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా జోయల్ డేవిస్‌ను బదిలీ చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. సీఐడీ డీఐజీగా నారాయణ నాయక్, టీఎస్‌ఆర్టీసీ ఎస్పీగా అపూర్వరావు, ట్రాన్స్‌కో డీసీపీగా గిరిధర్ నియమితులయ్యారు. జోగులాంబ డీఐజీగా ఎల్.ఎస్ చౌహాన్, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా సాధనా రష్మి నియమితులయ్యారు. ఈస్ట్ జోన్ డీసీపీగా ఆర్.గిరిధర్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా డి.మురళీధర్‌ను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంపీడీవోల బదిలీలు
తెలంగాణలో ఆదివారం భారీగా ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 395 ఎంపీడీవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సొంత జిల్లాలో పనిచేస్తున్న వారితో పాటు మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఈసీ డిసెంబరులో అన్ని రాష్ట్రాలను ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలతో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీవోలను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. శనివారం రెవెన్యూ శాఖలో 132 మంది తహసీల్దార్లను, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఇతర శాఖల్లోనూ భారీగా బదిలీలు జరగనున్నట్లు సమాచారం.
ఎమ్మార్వో, డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
తెలంగాణలో భారీగా అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీలు చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో శనివారం తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా పలువురు అధికారులకు బదిలీలతో పాటు ప్రమోషన్లు ఇచ్చింది. ఇప్పటి వరకూ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులు ఇచ్చింది. దీంతో పాటు 132 మంది ఎమ్మార్వోలు ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. మల్టీజోన్-1, మల్టీజోన్-2లో ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. మల్టీజోన్-1లో 84 మంది, మల్టీజోన్-2లో 48 మొత్తం 132 మంది ఎమ్మార్వోలను బదిలీ చేసింది. ఒకే చోట మూడేళ్లుగా పని చేస్తున్న అధికారులు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి.
తెలంగాణలో ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను, ఓ ఐఎఫ్‌ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్‌ను బదిలీ చేశారు. ఆమె ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్ నికోలస్‌ను నియమించారు.