TS IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ బదిలీలు.. TSPSC కార్యదర్శిగా నవీన్ నికోలస్
TS IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉతర్వులు జారీ చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా నవీన్‌నికోలస్‌ను నియమించారు.
TS IAS Transfers: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను, ఓ ఐఎఫ్‌ఎస్ అధికారిని బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రస్తుతం పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శిగా ఉన్న అనితా రామచంద్రన్‌ను బదిలీ చేశారు. ఆమె ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్ నికోలస్‌ను నియమించారు.
నవీన్ నికోలస్ గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడిగా పని చేసినప్పుడు గురుకుల నియామక బోర్డు కన్వీనర్‌గా బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆ సమయంలో గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలను భర్తీ ప్రక్రియ పర్యవేక్షించిన అనుభవం ఉంది.
ఐఏఎస్‌గా పదోన్నతులు పొంది వెయిటింగ్‌లో ఉన్న సీతాలక్ష్మి, ఫణీంద్రరెడ్డిలకు పోస్టింగులు ఇచ్చారు. ఐఎఫ్‌ఎస్ అధికారి వీఎస్‌ఎన్వీ ప్రసాద్ పౌరసరఫరాల డైరెక్టర్‌గా నియమించారు.
టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. వీరితోపాటు పలు వురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మత్స్యశాఖ డైరెక్టర్‌గా ఉన్న లచ్చిరాం భూక్యాను బాధ్యతల నుంచి రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు తిప్పి పంపించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఉన్న బి.గోపికి ఫిషరీస్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
హైదరాబాద్ జిల్లా చీఫ్ రేషనింగ్ అధికారి బి.బాలమాయాదేవి బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా నియమించారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.హనుమంతరావును రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ ఆఫీషియో సెక్రటరీగా బదిలీ చేశారు.
సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో సెక్రటరీ కె. అశోక్‌రెడ్డిని ఉద్యానవనశాఖ డైరెక్టర్ బదిలీ చేశారు.
క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ ఎ.నిర్మలకాంతి వెస్లీని స్త్రీ, శిశు, వయోజనుల సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. కే ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ పోస్టును సైతంఆమె కేటాయించారు.
హైదరాబాద్ జూ పార్క్ డైరెక్టర్‌గా ఉన్న విఎస్‌ఎన్‌వి.ప్రసాద్‌కు పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నియమించింది. వెయిటింగ్‌లో ఇద్దరిలో సీతాలక్ష్మిని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీల కార్యదర్శిగా నియమించారు. జి.ఫణీంద్రరెడ్డికి హైదరాబాద్ జిల్లా రేషనింగ్ అధికారిగా బదిలీ చేశారు.
కమిషన్ గాడిన పడినట్టేనా…?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే ఛైర్మన్‌తో పాటు కొత్త సభ్యుల నియామకం కూడా కొలిక్కి వచ్చింది. కార్యదర్శి నియామకం కూడా పూర్తి కావడంతో ఇక నోటిఫికేషన్లపై దృష్టి సారించాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సన్నద్ధతలో నిమగ్నమై ఉంటారు. ఈ నేపథ్యంలో కొత్త నోటిపికేషన్లు జారీ చేయడం, ఉద్యోగా భర్తీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు చేపట్టే అవకాశాలు ఉండకపోవచ్చు.
నోటిఫికేషన్లను వెలువరించడానికి మాత్రం అటంకాలు ఉండకపోవచ్చు. ఉద్యోగాల భర్తీ, గతంలో విడుదలై పేపర్ లీక్ వివాదాలతో రద్దైన పరీక్షలతో పాటు కొత్త నోటిపికేషన్ల కోసం యువత ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టిఎస్‌పిఎస్సీ నుంచి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.