తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Allu Arjun : నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నేను ఎలాంటి రోడ్ షో చేయలేదు- అల్లు అర్జున్

Allu Arjun : నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, నేను ఎలాంటి రోడ్ షో చేయలేదు- అల్లు అర్జున్

21 December 2024, 21:05 IST

google News
  • Allu Arjun : నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హీరో అల్లు అర్జున్ ఆరోపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. రోడ్ షో చేసుకుంటూ వెళ్లామనడం సరికాదన్నారు.

నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రోడ్ షో చేయలేదు- అల్లు అర్జున్
నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రోడ్ షో చేయలేదు- అల్లు అర్జున్

నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, రోడ్ షో చేయలేదు- అల్లు అర్జున్

Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట జరిగిందని అసెంబ్లీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. రోడ్ షో చేశామని చెప్పడం సరికాదన్నారు. అనుమతి లేకుండా వెళ్లామన్నది తప్పుడు ఆరోపణ అన్నారు. ప్రభుత్వంతో తనకు ఎలాంటి వివాదం లేదన్నారు. సినిమా ఇంత పెద్ద హిట్టు అయినా... ఆ సక్సెస్ ను ఆస్వాదించలేకపోతున్నానన్నారు. 15 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నానని అన్నారు. తొక్కిసలాట గురించి మరుసటి రోజే తనకు తెలిసిందన్నారు.

"నా పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నా వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తున్నారు. నేను పర్మిషన్ లేకుండా థియేటర్ వెళ్లాననేది తప్పు సమాచారం. నేను రోడ్డు షో చేసుకుంటూ వెళ్లలేదు. నేను సినిమా చూస్తున్నప్పుడు నా దగ్గరకు పోలీసులు రాలేదు. నా మేనేజ్మెంట్ వచ్చి బయట జనం ఎక్కువ అవుతున్నారని చెప్పారు. దీంతో నేను అక్కడి నుంచి వెళ్లి పోయాను. తర్వాతి రోజు నాకు తెలిసింది. ఓ మహిళ చనిపోయింది, బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయని తెలిసింది. ఆసుపత్రికి వెళ్లాలని అనుకుంటే...బన్ని వాస్ నేను వెళ్లి మాట్లాడతానని చెప్పారు. ఆయన వెళ్లి వచ్చి నాపై కేసు పెట్టారని చెప్పారు. దీంతో నేను వారిని కలవడానికి లేదని లాయర్లు చెప్పారు. అందుకు నేను బాధితులను కలవలేకపోయాను. నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. బాధితులను పట్టించుకోలేదనేది అవాస్తవం"- హీరో అల్లు అర్జున్

"నేను సినిమా చూసేందుకు నా భార్య, పిల్లలతో వెళ్లాను. పిల్లలకు ఏమైనా అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చనిపోతే నేను వెళ్లి స్వయంగా పరామర్శించాను. ఇప్పుడు నా అభిమాని చనిపోతే వెళ్లలేదనడం సరికాదు. కానీ కేసు కారణంగా నేను స్వయంగా వెళ్లలేకపోయాను. అందుకు ప్రత్యేక అనుమతి తీసుకుని నా తండ్రిని పంపాను. అలాగే సుకుమార్, బన్ని వాసును పంపాను. శ్రీతేజ్ ఆరోగ్యం గురించి గంట గంటకూ తెలుసుకుంటున్నాను. రేవతి మృతిపై ఎలా స్పందించాలో నాకు ఇప్పటికీ అర్థం కావడంలేదు. ఈ విషయంపై ఇంకా నాకు క్లారిటీ రావడంలేదు. పోలీసుల అనుమతితోనే నేను థియేటర్ కు వెళ్లాను. థియేటర్ కు వెళ్లేందుకు పోలీసులే రూట్ క్లియర్ చేశారు"-హీరో అల్లు అర్జున్

ఎవరినో నిందించడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు

తానేవరినీ నిందించడానికి ఈ ప్రెస్‌ మీట్‌ పెట్టలేదని హీరో అల్లు అర్జున్ అన్నారు. తమ సినిమాకు ప్రభుత్వం అన్ని విధాలుగా సపోర్ట్‌ చేసిందన్నారు. అందుకు ధన్యవాదాలు అన్నారు. కానీ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 22 ఏళ్లుగా ఎంతో కష్టపడి సాధించిన గౌరవం ఒక రాత్రిలో పోగొట్టారన్నారు. అందుకు చాలా బాధగా ఉందన్నారు. అంతేగానీ తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపాలు లేవన్నారు. తనకు మానవత్వం లేదనడం చెప్పడం సరికాదన్నారు. ప్రస్తుతం న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నందున అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నానని అల్లు అర్జున్ అన్నారు.

"గత రెండు వారాలుగా బన్నీ పరిస్థితి చూస్తుంటే ఓ తండ్రిగా నేను తట్టుకోలేకపోతున్నాను. నా కడుపు తరుక్కుపోతుంది. తొక్కిసలాట విషయం తెలిసినప్పటి నుంచి అతడు ఇంటి గార్డెన్ లో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు. పుష్ప-2 సక్సెస్ మీట్లు పెట్టాలని ముంబయి, బీహార్ నుంచి ఫోన్లు వస్తున్నా వెళ్లలేకపోతున్నాడు. రిలాక్స్ కోసం స్నేహితుల వద్దకు, టూర్ కు వెళ్లమని చెప్పినా వినడంలేదు"- అల్లు అరవింద్

ఈ నెల 4వ తేదీన పుష్ప-2 సినిమా విడుదల సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు కోమాలో ఉన్నారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ అరెస్టై, హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన సంగతి తెలిసిందే.

తదుపరి వ్యాసం