TG Govt Jobs 2024 : తెలంగాణ చేనేత, జౌళి శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - ఖాళీలు, అర్హతలివే...!
21 July 2024, 12:32 IST
- Telangana Govt Recruitment 2024: తెలంగాణ చేనేత, జౌళిశాఖలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 30 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు.
తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాలు 2024
Telangana Govt Recruitment 2024 : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 30 కొలువులను రిక్రూట్ చేయనున్నారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ వివరాలను వెల్లడించారు.
30 పోస్టుల్లో క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులు 8 ఉన్నాయని కమిషన్ పేర్కొన్నారు. టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులు 22 ఉన్నట్టు వివరించారు. ఐఐహెచ్‌టీ నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమా చేసిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారని వివరించారు.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సంబంధిత ధ్రువపత్రాలను కూడా దరఖాస్తు సమయంలో సమర్పించాలని సూచించారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్లపాటు విధులు నిర్వహించాల్సి ఉంటుందని వెల్లడించారు. https://tsht.telangana.gov.in/HNDM/Views/Home.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు.
పోస్టల్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలివే…!
ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో 44,228 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫిషన్ ద్వారా జీడీఎస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ జులై 15 నుంచి ప్రారంభమైందని గుర్తించాలి. దరఖాస్తు చివరి తేది ఆగస్టు 5, 2024గా నిర్ణయించారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక ఉంటుంది.
indiapostgdsonline.gov.in ద్వారా ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారి వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకూ గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూడీ, ట్రాన్స్ఉమెన్ అభ్యర్థులకు ధరఖాస్తు ఫీజు ఉండదు. మిగిలినవారు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రిక్రూట్ మెంట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 656 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అలాగే తెలంగాణలో 454 పోస్టులకు అప్లికేషన్ ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగం పొందిన వారు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) / డాక్ సేవక్‌గా నియమితులవుతారు. పోస్ట్‌ల కోసం జీతాలు కింది విధంగా ఉన్నాయి: ABPM / GDS కోసం నెలకు రూ. 10,000 నుంచి రూ.24,470, BPM కోసం రూ.12,000, రూ.29,380.గా ఉండనుంది. 10వ తరగతి సర్టిఫికేట్ ఉన్న 18-40 సంవత్సరాల మధ్య ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు విధానం మూడు దశల్లో ఉంటుంది.
మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అవుతారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ఉండనుంది. సెలక్ట్ అయిన అభ్యర్థుల వివరాలు జీడీఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. మీ మెుబైల్ నెంబర్, ఈమెయిల్‌కు వెరిఫికేషన్ వివరాలను పంపిస్తారు.