IBPS Clerk 2024 : వివిధ బ్యాంకుల్లో 6,148 పోస్టులు- దరఖాస్తుకు నేడే చివరి రోజు..
IBPS Clerk 2024 apply online: వివిధ బ్యాంకుల్లో 6వేలకుపైగా పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుకు నేడే చివరి రోజు.

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నిర్వహించే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ క్లరికల్ కేడర్ (సీఆర్పీ క్లర్క్ 14) ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి (ఆదివారం)తో ముగియనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఐబీపీఎస్ క్లర్క్ 2024 కోసం సంస్థ వెబ్సైట్లో ibps.in దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఐబీపీఎస్ క్లర్క్ 2024 ద్వారా 11 బ్యాంకులు 6,148 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. అవి.. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్.
ఐబీపీఎస్ క్లర్క్ 2024 పేమెంట్ విండో కూడా నేటితో ముగియనుంది.
పరీక్ష సంబంధిత కార్యకలాపాల షెడ్యూల్ ప్రకారం, ఐబిపీఎస్ క్లర్క్ 2024 కోసం ప్రీ-ఎగ్జామినేషన్ శిక్షణ జూలై 12 నుంచి 18 వరకు జరిగింది. 2024 ఆగస్టులో ప్రిలిమ్స్ రౌండ్‌కు కాల్ లెటర్లు, అదే నెలలో ఆన్లైన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్‌లో విడుదలవుతాయి. మెయిన్స్ పరీక్ష అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ 2025 ఏప్రిల్‌లో షెడ్యూల్ చేశారు.
ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఖచ్చితమైన తేదీ, సమయంపై త్వరలో ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
ఐబీపీఎస్ క్లర్క్ 2024: అర్హత ప్రమాణాలు
వయోపరిమితి..
జూలై 1, 2024 నాటికి దరఖాస్తుదారుడికి కనీసం 20ఏళ్లు ఉండాలి. 28ఏళ్లు మించకూడదు. మరో మాటలో చెప్పాలంటే, దరఖాస్తుదారుడు జూలై 2, 1996- జూలై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి (రెండు రోజులు కలిపి). రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
విద్యార్హత..
ఈ బ్యాంకుల్లో క్లర్క్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత అవసరం. అదనంగా, కంప్యూటర్ సిస్టెమ్స్ ఆపరేటింగ్, వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేషన్స్/లాంగ్వేజ్‌లలో సర్టిఫికెట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ లేదా హైస్కూల్ లేదా కాలేజీలో కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలనుకునే రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత అధికారిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
ఐబీపీఎస్ క్లర్క్ 2024కు దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అర్హతలతో పాటు, అభ్యర్థులు చేరే సమయంలో ఆరోగ్యకరమైన క్రెడిట్ హిస్టరీని కూడా కలిగి ఉండాలి.
భాగస్వామ్య బ్యాంకుల పాలసీ ప్రకారం కనీస క్రెడిట్ స్కోర్ ఉంటుందని, చేరే సమయంలో అప్డేట్ చేసిన సిబిల్ స్టేటస్ లేని వారు దానిని అప్డేట్ చేసుకోవడం లేదా సిబిల్లో ప్రతికూలంగా ప్రతిబింబించే ఖాతాలకు సంబంధించి ఎలాంటి బకాయిలు లేవని రుజువు చేస్తూ రుణదాతల నుంచి ఎన్వోసీలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి దీన్ని చేయడంలో విఫలమైతే ఆఫర్ లెటర్ ను ఉపసంహరించుకోవచ్చు/ రద్దు చేయవచ్చని ఐబీపీఎస్ తెలిపింది.
ఐబీపీఎస్ క్లర్క్ 2024: ప్రిలిమ్స్ పరీక్ష వివరాలు..
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షలో 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు పేపర్ రాయడానికి 60 నిమిషాల సమయం ఉంటుంది.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ (30 మార్కులకు 30 ప్రశ్నలు), న్యూమరికల్ ఎబిలిటీ (35 మార్కులకు 35 ప్రశ్నలు), రీజనింగ్ ఎబిలిటీ (35 ప్రశ్నలు, 30 మార్కులు) అనే మూడు విభాగాలుగా ప్రశ్నపత్రాన్ని విభజించారు.
ప్రిలిమ్స్ పరీక్షలోని మూడు విభాగాల్లో ప్రతిదానిలోనూ సంస్థ నిర్ణయించే కటాఫ్ మార్కులు సాధించడం ద్వారా అభ్యర్థులు అర్హత సాధించాలి.
సంబంధిత కథనం