తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak : రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది.. ప్రజల సమస్యలు పట్టవా? : హరీష్ రావు

Medak : రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది.. ప్రజల సమస్యలు పట్టవా? : హరీష్ రావు

23 December 2024, 14:24 IST

google News
    • Medak : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి ప్రజల సమస్యల కంటే.. అల్లు అర్జున్ ఇష్యూ ముఖ్యమా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా.. ఇప్పటికీ విద్యా శాఖకు మంత్రి లేరని విమర్శలు గుప్పించారు.
హరీష్ రావు
హరీష్ రావు

హరీష్ రావు

రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ.. ప్రజల సమస్యలు ముఖ్యం కావా? అని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. 20 వేల సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద పడితే ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. టీ తాగినంత సమయంలోనే సమస్యలు పరిష్కరిస్తా అని మాట తప్పారని విమర్శించారు.

స్పందన లేదు..

'డిసెంబర్ 9 నుండి సమ్మె చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు. అసెంబ్లీలో నిలదీసినా స్పందన లేదు. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి, మంత్రులు మోసం చేశారు. ఎంత మంది మాట్లాడినా చలనం లేకుండా ఉన్నారు. విద్యా శాఖకు మంత్రి లేడు. బడ్జెట్ లో 15 శాతం నిధులు అని, 7 శాతం కూడా పెట్టలేదు. ఒకటో తారీఖు జీతాలు అని నరుకుతున్నరు తప్ప, చేతల్లో ఏం లేదు' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

వట్టి మాటలే..

'నిరసన చేయడం వల్ల లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది. గ్రీన్ ఛానెల్ నిధులు అనేది వట్టి మాటలే. సస్పెండ్ చేయాల్సింది వార్డెన్లు, ప్రిన్సిపాల్‌ను కాదు. రేవంత్ రెడ్డిని చేయాలి. ఉన్న పథకాలు ఇవ్వరు, కొత్త పథకాలు లేవు. పింఛన్లు పెంచుతామని మోసం చేశారు. వృద్ధాప్య పింఛన్లు రెండు నెలలు ఎగ్గొట్టిండు. బడా కాంట్రాక్టర్లు పెర్సెంటెజ్ తీస్కొని బిల్లులు ఇస్తున్నారు' అని హరీష్ ఆరోపించారు.

ప్రశ్నిస్తే కేసులా..

'మాజీ సర్పంచులకు బిల్లులు ఇవ్వడం లేదు . ప్రశ్నిస్తే ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. రేవంత్ ఇచ్చిన హామీ అమలు చేసేదాకా నిరంతరం బీఆర్ఎస్ అండగా ఉంటుంది. సమస్య పరిష్కారం అయ్యేదాకా కొట్లడుతం. ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వానికి త్వరలో డెలిగేషన్ ఇస్తాం. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ మాట తప్పారు. ముల్లును ముల్లు తోనే తీయాలి. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించండి. రేవంత్‌ను నిలదీయండి' అని హరీష్ రావు పిలుపునిచ్చారు.

తదుపరి వ్యాసం