తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తండ్రి ఆత్మహత్య

Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తండ్రి ఆత్మహత్య

13 October 2024, 17:38 IST

google News
    • Kamareddy : కుటుంబ కలహాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ముగ్గురు మృతిచెందడంతో.. వారి గ్రామంలో విషాదయ ఛాయలు అలుముకున్నాయి.
రోదిస్తున్న శ్రీనివాస్ రెడ్డి బంధువులు
రోదిస్తున్న శ్రీనివాస్ రెడ్డి బంధువులు

రోదిస్తున్న శ్రీనివాస్ రెడ్డి బంధువులు

కామారెడ్డి జిల్లా నందివాడ గ్రామంలో తీవ్ర విషాదం జరిగింది. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. ఓ తండ్రి ఆత్మహత్యకు చేసుకున్నారు. దీంతో నందివాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నందివాడ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి (35), అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు విఘ్నేష్‌ (6), అనిరుధ్‌ (4)ఉన్నారు.

శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో.. దుర్గమ్మ నిమజ్జనానికి ఇద్దరు పిల్లలను తీసుకుని శ్రీనివాస్‌ రెడ్డి వెళ్లారు. రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భార్య శ్రీనివాస్ రెడ్డికి ఫోన్‌ చేసింది. ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్‌ చేయలేదు. రాత్రి 2 గంటల సమయంలో మళ్లీ ఫోన్‌ చేయగా.. స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో కంగారుపడిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికుల సాయంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలు కనిపించాయి. కానీ.. తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఆచూకీ లభించలేదు. ఆయన చెప్పులు, సెల్ ఫోన్ మాత్రం బావి వద్దే ఉన్నాయి. పిల్లల మృతదేహాలను బయటకు తీశారు.

స్థానికుల సాయంతో.. పోలీసులు బావిలోని నీటిని మోటారుతో తోడించారు. అనంతరం బావి లోపల శ్రీనివాస్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. ఒకేసారి తండ్రీ కుమారులు మృతిచెందడంతో.. నందివాడ గ్రామం విషాదంలో మునిగిపోయింది. కుటుం బసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే.. కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

తదుపరి వ్యాసం