తెలుగు న్యూస్ / ఫోటో /
CM Chandrababu : మూలా నక్షత్రం సరస్వతి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ, పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
- CM Chandrababu At Durga Temple : సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు దర్శించారు. అర్చకులు సీఎం చంద్రబాబు కుటుంబానికి వేద ఆశీర్వచనం అందించారు.
- CM Chandrababu At Durga Temple : సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు దర్శించారు. అర్చకులు సీఎం చంద్రబాబు కుటుంబానికి వేద ఆశీర్వచనం అందించారు.
(1 / 7)
సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు దర్శించారు. అర్చకులు సీఎం చంద్రబాబు కుటుంబానికి వేద ఆశీర్వచనం అందించిన, అమ్మవారి చిత్ర పటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
(2 / 7)
శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఆలయ అర్చకులు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
(3 / 7)
ఇంద్రకీలాద్రి ఆలయం చిన్నరాజగోపురం వద్ద సీఎం చంద్రబాబు తలకు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు. అనంతరం మేళతాళాలతో ప్రభుత్వం తరపున దుర్గమ్మకు సతీసమేతంగా సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలను సమర్పించారు. మూలా నక్షత్రంలో... సరస్వతీ అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు.
(4 / 7)
సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, ఎంపీ కేశినేని చిన్ని, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈవో కేఎస్ రామారావు, అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు.
(5 / 7)
మూలా నక్షత్రం కాబట్టి ఇవాళ వచ్చే భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే భక్తులకు ఒక ఉచిత లడ్డూ కూడా ఇస్తున్నామన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయన్నారు. దుర్గమ్మ దయ వల్ల రాష్ట్రంలో వర్షాలు బాగా పడ్డాయన్నారు. అమ్మవారి దయతో రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తవ్వాలన్నారు.
(6 / 7)
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గమ్మను మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏడో రోజు మూలా నక్షత్ర శుభముహూర్తాన సరస్వతీ దేవి అలంకారంలోని కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇతర గ్యాలరీలు