తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar News : ఫేస్​బుక్​లో పరిచయం, ఆపై లవ్..! సీన్ కట్ చేస్తే ఇద్దరూ అరెస్ట్, వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

Karimnagar News : ఫేస్​బుక్​లో పరిచయం, ఆపై లవ్..! సీన్ కట్ చేస్తే ఇద్దరూ అరెస్ట్, వెలుగులోకి షాకింగ్ నిజాలు..!

HT Telugu Desk HT Telugu

25 October 2024, 6:57 IST

google News
    • కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఫేస్ బుక్ లో పరిచయమయ్యారు. ప్రేమగా మారటంతో కొంతకాలం పాటు బాగానే ఉన్నారు. సీన్ కట్ చేస్తే… ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. జమ్మికుంట పోలీసులు విచారణ చేపట్టగా… వెలుగులోకి షాకింగ్ నిజాలు బయటికి వచ్చాయి. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ఫేస్ బుక్ ప్రేమికులు అరెస్ట్...!
ఫేస్ బుక్ ప్రేమికులు అరెస్ట్...! (image source unsplash.com)

ఫేస్ బుక్ ప్రేమికులు అరెస్ట్...!

కరీంనగర్ జిల్లాలో ఫేస్ బుక్ ప్రేమికులు అరెస్టై కటకటాల పాలయ్యారు. ఫేస్ బుక్ లో పరిచయమై ప్రేమాయణం సాగించి చివరకు ఒకరిపై మరొకరు పోలీసులకు పిర్యాదు చేసుకోవడంతో కిలాడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ తరలించారు.

కరీంనగర్ కు చెందిన వివాహిత మహిళకు జమ్మికుంట కు చెందిన కోడూరి రాజేష్ తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమికులుగా మారారు. ఇద్దరు కలిసి తిరిగారు. ఈనెల 21 వివాహిత మహిళా జమ్మికుంటలోని రాజేష్ ఇంటికి చేరింది. ఇద్దరు కలిశాక ఏమైందో ఏమో తెలియదు కానీ, ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.

రాజేష్ ఇంటికి పిలిచాడని… కోరిక తీర్చాలని లేదంటే చంపుతానని బెదిరించాడని వివాహిత పిర్యాదులో పేర్కొంది. అందుకు తాను నిరాకరిస్తే బలవంతంగా అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది‌. రాజేష్ మాత్రం ఆమె చెప్పేది అబద్దమని తెలిపాడు. జమ్మికుంట కు వచ్చిన మహిళా… డబ్బులు డిమాండ్ చేసిందని, డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడుతానని బెదిరించడంతో పది వేలు ఇవ్వగా మరో పది వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేసినట్లు తెలిపాడు.

కి'లేడీ' మోసాలు...!

ఇద్దరి ఫిర్యాదులను చూసిన పోలీసులు అవాక్కై ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా విస్తుబోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా కిలాడిగా మారి పలువును మోసం చేసిందని తేలింది. రాజేష్ నే కాకుండా కరీంనగర్ టూ టౌన్ పరిధిలో ఇద్దరిని మోసం చేసి రెండు లక్షల 20 వేల వరకు వసూలు చేసిందని గుర్తించారు.

మానకొండూరు పీఎస్ పరిధిలో ఐదుగురు గ్యాంగ్ రేప్ చేశారని బ్లాక్ మెయిల్ కు పాల్పడిందని పోలీసుల విచారణలో బయటపడింది. మరొకరిని మోసం చేయకుండా ఉండేందుకు మహిళపై సైతం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు జమ్మికుంట సీఐ రవీందర్ తెలిపారు. మహిళా ఫిర్యాదు మేరకు రాజేష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. ఫేస్ బుక్, సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సిఐ సూచించారు. ఫేస్ బుక్ లవ్ అరెస్టు ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం