తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Facebook Love: కరీంనగర్ జిల్లాలో పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కిన ఫేస్‌బుక్ ప్రేమాయణం

Facebook Love: కరీంనగర్ జిల్లాలో పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కిన ఫేస్‌బుక్ ప్రేమాయణం

HT Telugu Desk HT Telugu

24 October 2024, 9:00 IST

google News
    • Facebook Love: కరీంనగర్ జిల్లాలో ఫేస్ బుక్ ప్రేమాయణం ఠాణా మెట్లెక్కింది. చేట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇద్దరు ఒకరిపై మరొకరు పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
పోలీస్ స్టేషన్‌కు చేరిన ఫేస్‌బుక్ లవ్ స్టోరీ
పోలీస్ స్టేషన్‌కు చేరిన ఫేస్‌బుక్ లవ్ స్టోరీ

పోలీస్ స్టేషన్‌కు చేరిన ఫేస్‌బుక్ లవ్ స్టోరీ

Facebook Love: కరీంనగర్ కు చెందిన వివాహితురాలైన మహిళకు జమ్మికుంట కు చెందిన కోడూరి రాజేష్ తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. చాటింగ్ లతో ప్రేమాయణం సాగించారు. నీవు అక్కడ...నేను ఇక్కడ.. ఎందుకు మనిద్దరి మద్య ఫేస్ బుక్ బంధం...నేరుగా ఇద్దరం కలుద్దాం అనుకున్నారు. అనుకున్నట్టుగానే వివాహిత మహిళా జమ్మికుంట కు చేరింది. నిందితుడు రాజేష్ ను కలిసింది. ఇద్దరు కలిశాక ఏమైందో ఏమో తెలియదు కానీ, ఇద్దరు పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. ఒకరిపై మరొకరు పిర్యాదు చేసుకున్నారు. ఇద్దరి ఫిర్యాదులను చూసిన పోలీసులు అవాక్కై ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

అత్యాచారం చేశాడు... వివాహిత

వివాహిత మహిళ తనపై రాజేష్ బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు పిర్యాదు చేసింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన రాజేష్, నేను తరచు కలుసుకునే వాళ్ళమని తెలిపారు. ఈనెల 21న జమ్మికుంటకు రమ్మని రాజేష్ కోరగా వెళ్ళానని.. ఇంటిలో ఎవరు లేరని పిలిచానని చెప్పి, తన కోరిక తీర్చాలని లేదంటే చంపుతానని బెదిరించాడని తెలిపారు. అందుకు తాను నిరాకరిస్తే బలవంతంగా అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది‌.

డబ్బులు ఇవ్వకుంటే రేప్ కేసు పెట్టింది

ఫేస్ బుక్ లో మహిళా ద్వారా ప్రేమాయణం సాగించిన రాజేష్ మాత్రం ఆమె చెప్పేది అబద్దం అంటున్నాడు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన మహిళా తనతో ఫ్రెండ్ షిప్ చేసి 21న ఫోన్ చేసి జమ్మికుంట వస్తున్నానని చెప్పిందని తెలిపారు. జమ్మికుంట కు వచ్చిన మహిళా డబ్బులు డిమాండ్ చేసిందని, డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడుతానని బెదిరించిందని తెలిపాడు. ఆమె బెదిరింపులతో భయపడి తానే ముందు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఫిర్యాదు చేశానని చెప్పాడు.

ఏది నిజం…

ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారి వివాదాస్పదం కావడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ఏది నిజమో తెలియక జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంటికొచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేశానని రాజేష్ అంటుంటే, ఇంటికి పిలిచి ఒంటరిగా ఉండడం చూసి అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ అంటుంది. ఒకరిపై మరొకరు పొంతన లేకుండా ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి అసలు ఇద్దరి మధ్య ఏం జరిగిందో తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం