Joining's In TRS : టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎంపీ రాపోలు
26 October 2022, 19:41 IST
- ex mp rapolu ananda bhaskar: బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీఆర్ఎస్ లో చేరిన రాపోలు ఆనంద భాస్కర్
rapolu ananda bhaskar joins in trs:మునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బీజేపీ నేతలే టార్గెట్ గా టీఆర్ఎస్… ఆపరేషన్ ఆకర్షన్ షురూ చేసింది. ఇందులో భాగంగా కీలక నేతలు... గులాబీ గూటికి ఒక్కొక్కరిగా చేరిపోతున్నారు. తాజాగా మాజీ ఎంపీ రాపోల్ ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జేపీ నడ్డాకు లేఖ రాశారు.
బీజేపీకి రాజీనామా చేసిన రాపోల్ ఆనంద భాస్కర్... టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు మంత్రి కేటీఆర్... కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ లో చేరటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
బీజేపీకి రాజీనామా చేసిన రాపోల్ ఆనంద భాస్కర్... టీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు మంత్రి కేటీఆర్... కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ లో చేరటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.... తెలంగాణ ప్రజలకు పెద్ద కొడుకు కేసీఆర్ అని అన్నారు. వేరే పార్టీలో ఉన్నా కూడా మిషన్ భగీరథను ఉన్నప్పుడు పొగిడాను అని చెప్పారు. గత ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి.. టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు రాపోలు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు.
2012లో కాంగ్రెస్ తరఫున రాపోలు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2018లో పదవీకాలం పూర్తి కావడంతో 2019లో ఆయన బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ గూటికి చేరారు.
టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్... బీజేపీలోకి వెళ్లటంతో అలర్ట్ అయిన గులాబీ అధినాయకత్వం... వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పాత మిత్రులపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా సామాజికవర్గాల వారీగా చర్చలు మొదలుపెట్టేసింది. వెనువెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లె రవి కుమార్ గౌడ్ దంపతులను పార్టీలోకి రప్పించింది. అంతటితో ఆగని టీఆర్ఎస్... అదే సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బూడిద బిక్షమయ్య గౌడ్ ను పార్టీలోకి తీసుకువచ్చి బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. దాసోజు శ్రవణ్ తో స్వామి గౌడ్ కూడా బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వాళ్లు కూడా గులాబీ గూటికి చేరారు.