తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr : తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం మూర్ఖత్వం, మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? - కేసీఆర్

KCR : తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం మూర్ఖత్వం, మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? - కేసీఆర్

08 December 2024, 20:50 IST

google News
  • KCR : తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. విగ్రహం మార్పు మూర్ఖత్వమన్నారు. మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

లంగాణ తల్లి విగ్రహం మార్చడం మూర్ఖత్వం, మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? - కేసీఆర్
లంగాణ తల్లి విగ్రహం మార్చడం మూర్ఖత్వం, మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? - కేసీఆర్

లంగాణ తల్లి విగ్రహం మార్చడం మూర్ఖత్వం, మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? - కేసీఆర్

తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం మూర్ఖత్వమని మండిపడ్డారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవేనా? అని ప్రశ్నించారు. మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని నిలదీశారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ...ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ సమావేశాలకు హాజరవ్వాలన్నారు. అంశాలవారీగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు, తెలంగాణ తల్లి విగ్రహం, మూసీ, హైడ్రా, గురుకులాలు, విద్యారంగంపై ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ ప్రస్తావించాలన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో హామీలు, వైఫల్యాలను ఎత్తి చూపాలన్నారు. ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫిబ్రవరి బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసఆర్ పార్టీ శ్రేణులకు తెలిపారు. కమిటీ ఏర్పాటు తర్వాత సభ్యత నమోదు చేపడతామన్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయంపై సభలో నిలదీయాలని కేసీఆర్ అన్నారు. ఫార్మాసిటీ ప్రతిపాదనలను, పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ఆరోపించారు.

తెలంంగాణ చరిత్రపై కాంగ్రెస్ కు అవగాహన లేదు- కేటీఆర్

తెలంగాణ ఉద్యమం, చరిత్రపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మూర్ఖంగా, అనాలోచితంగా తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చి, తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గమైన పనిని ప్రజల గొంతుకగా అసెంబ్లీ, మండలిలో నిలదీస్తామన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ప్రజలకు విపరీతమైన ఆవేదన ఉందన్నారు. వారి ఆవేదనకు బీఆర్‌ఎస్‌ గొంతుకై నిలుస్తుందన్నారు. తెలంగాణ ప్రజల తరఫున సూటిగా ప్రశ్నిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టిందని ఆరోపించారు. గ్రామాల్లో కనీసం పిచికారీ చేసేందుకు పైసలు ఇచ్చేవారు లేరన్నారు. కనీసం సర్పంచులు కూడా లేరన్నారు.

పల్లె ప్రగతి పేరుతో చక్కగా నడిచి, దేశంలో అత్యుత్తమ గ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. అయితే కాంగ్రెస్ ఈ విధానాన్ని నాశనం చేసిందన్నారు. దళితబంధు అమలు చేస్తామని, రూ.12లక్షలు ఇస్తామని మాయమాటలు చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు అంబేడ్కర్‌ అభయహస్తం పేరుతో దళిత బంధు ఇస్తామని చెప్పి ఏడాది దాటిందన్నారు. ఇప్పటి వరకు రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. రైతుబంధులో రెండోవిడత డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు.

తదుపరి వ్యాసం