తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Mla Kaushik Reddy : నాలుగేళ్ల తర్వాత నీ సంగతి చూస్తా, సీఐకి కౌశిక్ రెడ్డి బెదిరింపులు-కేసు నమోదు

BRS Mla Kaushik Reddy : నాలుగేళ్ల తర్వాత నీ సంగతి చూస్తా, సీఐకి కౌశిక్ రెడ్డి బెదిరింపులు-కేసు నమోదు

04 December 2024, 20:45 IST

google News
  • BRS Mla Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు. తన ఫిర్యాదు తీసుకోలేదని ఆరోపిస్తూ...నీ సంగతి చూస్తానంటూ సీఐపై బెదిరింపులకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పోలీసుల సంగతి చూస్తానంటూ హెచ్చరించారు.

నాలుగేళ్ల తర్వాత నీ సంగతి చూస్తా, సీఐకి కౌశిక్ రెడ్డి బెదిరింపులు-కేసు నమోదు
నాలుగేళ్ల తర్వాత నీ సంగతి చూస్తా, సీఐకి కౌశిక్ రెడ్డి బెదిరింపులు-కేసు నమోదు

నాలుగేళ్ల తర్వాత నీ సంగతి చూస్తా, సీఐకి కౌశిక్ రెడ్డి బెదిరింపులు-కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన విధులను అడ్డగించి, బెదిరింపులకు పాల్పడ్డారని సీఐ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో పాటు 20 మంది బీఆర్ఎస్ నేతలపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఎమ్మె్ల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో హల్ చల్ చేశారు. బుధవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కౌశిక్ రెడ్డి తన ఫిర్యాదు తీసుకోవాలని సీఐను ఒత్తిడి చేశారు. ఆ సమయలో బయటకు వెళ్తోన్న సీఐ రాఘవేంద్రను కౌశిక్ రెడ్డి, తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. తన ఫిర్యాదు తీసుకున్నాకే బయటకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ కండువా కప్పుకో

అత్యవసరమైన పని మీద బయటకు వెళ్తున్నానని, తిరిగి వచ్చాక ఫిర్యాదు తీసుకుంటామని సీఐ చెప్పడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఐ వాహనాన్ని అడ్డుకుని నినాదాలు చేశారు. దీంతో సీఐ రాఘవేంద్ర వెనక్కి వచ్చి ఎమ్మెల్యే ఫిర్యాదు తీసుకున్నారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి సహనం కోల్పోయి... ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని విధులు చేయాలని సీఐని బెదిరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నీ సంగతి చెబుతానంటూ సీఐపై బెదిరింపులకు పాల్పడ్డారు. తనకు సీఎం బందోబస్తు ఉందని సీఐ వారించినా బీఆర్ఎస్ శ్రేణులు...సీఐను అడ్డుకుని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నువ్వే సెల్యూట్ కొడుతావంటూ హేళనగా మాట్లాడారు. కావాలనే మమ్మల్ని చూసి ఫిర్యాదు తీసుకోకుండా పారిపోతున్నారంటూ కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి సోదరులకు పోలీసులు ఎందుకు సెల్యూట్ కొడుతున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నిచారు. రేవంత్ రెడ్డి సోదరులు వార్డు మెంబర్ గా కూడా గెలవలేదన్నారు. ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రోటోకాల్ పాటించాలో పోలీసులు తెలుసుకోవాలన్నారు. తెలియకపోతే అసెంబ్లీ రూల్ బుక్ చదువుకో అంటూ విమర్శించారు. 10 ఏళ్లు తమ కింద పనిచేశారు.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ సంగతి చెబుతామని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీ సంగతి చూస్తా

నీకు దమ్ముంటే కాంగ్రెస్ కండువా కప్పుకో, నాతో పోటీ చెయ్యి అని సీఐపై కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎస్ఐకి ఫిర్యాదు ఇవ్వమని ఎలా చెబుతారంటూ ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను సీఐ రిసివ్ చేసుకోవాలని, ఇవాళ సీఐకి ప్రోటోకాల్ నేర్పించి వెళ్తామని పీఎస్ లో కాసేపు హల్ చల్ చేశారు. నాలుగేళ్ల తరువాత నీ సంగతి చెబుతామంటూ సీఐ రాఘవేంద్రతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

తదుపరి వ్యాసం