BRAOU Admissions 2024 : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, PG అడ్మిషన్లు - ఆన్లైన్ దరఖాస్తులకు మరికొద్ది గంటలే గడువు..!
15 November 2024, 11:20 IST
- Ambedkar Open University Admissions 2024: అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో(నవంబర్ 15) పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి.
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ప్రవేశాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో(నవంబర్ 15, 2024)తో పూర్తి కానుంది. ఇప్పటికే పలుమార్లు అధికారులు గడువు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు మరికొద్దిగంటు మాత్రమే మిగిలి ఉంది.
- ఇందులో భాగంగా… అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోవచ్చు. www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
- అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. ఆయా కోర్సులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియాల్లో అందుబాటులో ఉన్నాయి. వెబ్ సైట్ లోకి వెళ్లి కోర్సుల కాంబినేషన్ వివరాలు తెలుసుకోవచ్చు.
- పోస్ట్ గ్రాడ్యూయేషన్ కోర్సుల్లో ఏంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్ ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇవి కూడా తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో ఉన్నాయి.
- ఇక లైబ్రేరియన్ సైన్స్ (బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ) తో పాటు పలు రకాల డిప్లోమా కోర్సులు కూడా యూనివర్శిటీ ఆఫర్ చేస్తోంది.
- అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ సైట్ లో వెళ్లి ముందుగా అభ్యర్థి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఆన్ లైన్ దరఖాస్తుల రుసుంతో పాటు ట్యూషన్ ఫీజును ఆన్లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు.
ఇలా అప్లయ్ చేసుకోండి….
- డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ముందుగా https://www.braouonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే Admissions for UG (BA/B.Sc/B.Com) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ యూజీ ఫస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని పక్కన ఉండే Registration Linkపై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
- ఇక్కడ కొన్ని ఆప్షన్లు డిస్ ప్లే అవుతాయి. ఇంటర్ విద్యను ఏ మోడ్ లో పూర్తి చేశారనేది. రెగ్యూలర్ లో చూస్తే రెగ్యూలర్ ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ లో చేస్తే సంబంధిత ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
- ముందుగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అభ్యర్థి పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, చదవాల్సిన కోర్సును ఎంచుకోవాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత ఆన్ లైన్ దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ మీ పూర్తి వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
- ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
- కోర్సు ఫీజును ఆన్ లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
- చివరల్లో సబ్మిట్ చేసిన తర్వాత ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
- ఆ తర్వాత అడ్మిషన్ ఖరారుకు సంబంధించి యూనివర్శిటీ నుంచి సమాచారం అందుతుంది. మీరు ఎంచుకున్న స్టడీ సెంటర్ కు వెళ్లి మీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీని అందజేయాల్సి ఉంటుంది.
పీజీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు https://online.braou.ac.in/PG/PGFirstHome లింక్ పై క్లిక్ చేయాలి. ఇక డిప్లోమా కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు https://online.braou.ac.in/PG/PGFirstHome లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సెంటర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు దగ్గరగా, అనుకూలంగా ఉండే ప్రాంతాల వివరాలను వెబ్ సైట్ లో చూడొచ్చు.
కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాకుండా జిల్లాల్లోనూ స్టడీ సెంటర్లలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. మరిన్ని ముఖ్య వివరాల కోసం వర్సిటీ హెల్ప్ లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590, 7382929600 సంప్రదించవచ్చు.