తెలుగు న్యూస్ / ఫోటో /
Hyderabad Water Supply : హైదరాబాద్ వాసులకు అలర్ట్, ఈ నెల 11న తాగునీటి సరఫరాకు అంతరాయం-ఓటీఎస్ గడువు 30 వరకు పొడిగింపు
Hyderabad Water Supply : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈనెల 11న తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. నీటి సరఫరా పైపుల మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
(1 / 6)
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈనెల 11న తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. నీటి సరఫరా పైపుల మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
(2 / 6)
హైదరాబాద్ పరిధిలోని ఆర్సీపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, గంగారం, మదీనాగూడ, మియాపూర్, కేపీహెచ్‌పీ, చందానగర్, బీరంగూడ, అమీన్‌పూర్, ఎర్రగడ్డ, మూసాపేట, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు. స్థానికులు ఈ విషయం గమనించి సహకరించాలని కోరారు.
(3 / 6)
ఓటీఎస్-2024 గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నవంబర్ 30 వరకు పెండింగ్ నీటి బిల్లుల వన్ టైమ్ సెటిల్మెంట్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓటీఎస్ పథకం గడువును పెంచాలని వినియోగదారుల నుంచి భారీ ఎత్తున డిమాండ్ లు రావడంతో జలమండలి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖకు స్పందించిన ప్రభుత్వం.. పథకం గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. (image source from unsplash.com)
(4 / 6)
హైదరాబాద్ నగరంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న నల్లా కనెక్షన్ బిల్లులను వసూలు చేసేందుకు ప్రభుత్వం ఓటీఎస్ పథకం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న నల్లా బిల్లుల్ని.. ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ లేకుండా చెల్లించే అవకాశాన్ని కల్పించింది.
(5 / 6)
మొదటగా ఈ పథకాన్ని అక్టోబర్ 1 నుంచి 31 వరకు అమలు చేశారు. కానీ ఇదే నెలలో దసరా, దీపావళి వంటి పండగలు రావడంతో వినియోగదారులపై ఆర్థిక భారం పడింది. మరి కొందరు సొంతూళ్లకు వెళ్లారు. అలాంటి వారు ఈ పథకాన్ని వినియోగించుకోలేకపోయారు. దీంతో మరో అవకాశం ఇవ్వాలని అధికారుల్ని కోరారు. దీంతో జలమండలి.. ప్రభుత్వానికి లేఖ రాయగా, అందుకు సానుకూలంగా స్పందించి.. పథకం గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది.
(6 / 6)
పెండింగ్ నీటి బిల్లులను జలమండలి కార్యాలయాలు, ఆన్ లైన్ విధానంలో మీ-సేవ, ఏపీ ఆన్ లైన్ కేంద్రాలు, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఎన్ఈఎఫ్టీ, RTGS, BPPS, జలమండలి అధికారిక వెబ్ సైట్, లైన్ మెన్ల ద్వారా చెల్లించవచ్చు. జలమండలి అందించిన QR Code ను స్కాన్ చేయడం ద్వారా.. వినియోగదారులు తమ బకాయిలు, చెల్లించే మొత్తం, రాయితీ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ఓటీఎస్ పథకంపై ఏవైనా సందేహాలుంటే.. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు ఫోన్ చేయవచ్చు. (AFP)
ఇతర గ్యాలరీలు